ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – *దీర్ఘాయుష్మాన్ భవ!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*25,ఆగస్టు, 2025*
*దృగ్గణిత పంచాంగం*
➖➖➖✍️
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం*
*వర్షఋతౌః / భాద్రపద మాసం / శుక్లపక్షం*
*తిథి : విదియ* మ 12.34 వరకు ఉపరి తదియ
*వారం : సోమవారం* ( ఇందువాసరే )
*నక్షత్రం : ఉత్తర* రా 03.49 వరకు ఉపరి హస్త
*సూర్యోదయాస్తమాలు:*
ఉ05.53/సా06.26విజయవాడ
ఉ06.01/సా06.35హైదరాబాద్
*సూర్యరాశి : సింహం చంద్రరాశి : సింహం/కన్య*
*యోగం : సిద్ధ* మ 12.06 వరకు ఉపరి సాధ్య
*కరణం : కౌలువ* మ 12.34 తైతుల రా 01.10 ఉపరి గరజి
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.00 – 07.00 & 11.30 – 12.30*
అమృత కాలం : రా 08.06 – 09.49
అభిజిత్ కాలం : ప 11.44 – 12.34
*వర్జ్యం : ఉ 09.49 – 11.32*
*దుర్ముహూర్తం : మ 12.34 – 01.25 & 03.05 – 03.55*
*రాహు కాలం : ఉ 07.27 – 09.01*
గుళికకాళం : మ 01.43 – 03.17
యమగండం : ఉ 10.35 – 12.09
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : ఉ 05.53 – 08.24
సంగవ కాలం : 08.24 – 10.54
మధ్యాహ్న కాలం : 10.54 – 01.25
అపరాహ్న కాలం : మ 01.25 – 03.55
*ఆబ్ధికం తిధి : భాద్రపద శుద్ధ తదియ*
సాయంకాలం :సా 03.55 – 06.26
ప్రదోష కాలం : సా 06.26 – 08.43
రాత్రి కాలం : రా 08.43 – 11.46
నిశీధి కాలం : రా 11.46 – 12.32
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.07.✍️
*-ముక్తినూతలపాటి శ్రీనువాసు,*
📞99497 22792*
*ఒంగోలు, ప్రకాశం జిల్లా.*
➖▪️➖
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*25-08-2025-సోమవారం*
*రాశి ఫలితాలు:*
➖➖➖✍️
“`
మేషం
ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
వృషభం
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.
మిధునం
నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
కర్కాటకం
మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం
ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి.
కన్య
చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి.
తుల
నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. సోదర స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
ధనస్సు
కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారములను విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు.
మకరం
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం
వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి.
మీనం
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలుచేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.✍️“`
***************************
*…ముక్తినూతలపాటి వాసు.*
. *శుభమస్తు!* ______________________________
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*