నేటి సత్యం

*టియుడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల వైద్య శిబిరానికి విశేష స్పందన*
*సమాజానికి సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్*
నేటి సత్యం నగర్ కర్నూల్ సెప్టెంబర్ 10
*జర్నలిస్టులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఓపి, ఔషధాల్లో 40 శాతం రాయితీ కల్పించాలి*
*ప్రభుత్వ జర్నల్ ఆస్పత్రిలో జర్నలిస్టుల వైద్య సేవలకు ప్రత్యేక పిఆర్ఓ ఏర్పాటు చేయాలి*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, జిల్లా అధ్యక్షులు విజయకుమార్, జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్*
సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు.తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్ మలక్ పేట్ యశోద హాస్పిటల్, శ్రీ నేత్ర సనత్ నగర్ వారి సహకారంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో బుధవారం జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జూపల్లి అరుణ్ కుమార్ రావు, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్,సురేష్ కుమార్, జాతీయ నాయకులు సుదర్శన్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ….
జర్నలిస్టు వృత్తి సమాజంలో ఎంతో బాధ్యతాయుతమైనదని, ప్రజల సమస్యలను పరిష్కరింప చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని, అలాంటి జర్నలిస్టులు ప్రజలకు సేవ చేయాలంటే ఆరోగ్యం ముఖ్యమని తెలిపారు.
మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన ఐజేయూ యూనియన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ముఖ్యంగా గుండె కు సంబంధించిన పరీక్షలు తప్పక చేసుకోవాలన్నారు. జర్నలిస్టులు ప్రజల కోసం సేవ చేయాలంటే ముందు వారికి ఆరోగ్యమే ప్రధానం అన్నారు.శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని జర్నలిస్టులు నికార్సైన వార్తలు ఇవ్వాలని తెలిపారు.నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు తనకు మధ్య వారధిలా పని చేస్తు అనునిత్యం వార్తల సేకరణ లో ఉండే జర్నలిస్ట్లు తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్త వాహించాలని ఎమ్మెల్యే అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రత్యేక ఒపీని ఏర్పాటు చేయడానికి డాక్టర్లతో మాట్లాడుతానని ఆయన తెలిపారు.అంతకుముందు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గ జర్నలిస్టులందరికీ ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ లను ఉపయోగించడానికి హెల్మెట్ లను ఉచితంగా అందజేస్తామని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ….
జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, శరీరం కూడా ఒక ఆర్గానిక్ యంత్రం లాంటిదని,దానికి పరీక్షలు అవసరమన్నారు.ఈసీజీ, టు డీ ఇకో, రక్త పరీక్షల లాంటి బేసిక్ పారామీటర్స్ చూసుకోవాలన్నారు.ఒత్తిడితో కూడిన ఈ వృత్తిలో ఆహారపు అలవాట్లు, దినచర్య అలవర్చుకోవాలని కోరారు.యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ సభ్యులు, యశోద ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
తాము కూడా పోలీస్ పోలీస్ సిబ్బందికి అమ్రాబాద్ లో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ హెల్త్ క్యాంపులు జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.నాగర్ కర్నూల్ జర్నలిస్టులకు తనకు మంచి అనుబంధ ఉందని వారి కార్యక్రమాలకు విరివిగా హాజరవుతున్నానని,జర్నలిస్టులు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని జర్నలిస్టు సంఘాల నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జూపల్లి అరుణ్ రావు మాట్లాడుతూ…
ప్రజల శ్రేయస్సుకు అహర్నిశలు కష్టపడే జర్నలిస్టులు, వారి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.ఇలాంటి కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ చొరవతోని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నందుకు చాలా సంతోషించదగ్గ విషయమని ఆయన తెలిపారు.జర్నలిస్టు నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు.
టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ..
ఆరోగ్యమే మహాభాగ్యం అని, జర్నలిస్టులందరూ ఆరోగ్యంగా ఉంటూ సమాజానికి ఆరోగ్యకరమైన వార్తల అందించాలని సూచించారు. ఒకప్పటి జర్నలిజానికి,నేటి జర్నలిజానికి చాలా మార్పు వచ్చిందని, పోటీ తత్వం పెరిగిందని తెలిపారు.జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ సూచన మేరకు నాగర్ కర్నూల్ లో యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.సోషల్ మీడియా ప్రాబల్యం ఎక్కువైందని నిజా నిజాలు తెలియకుండా వార్తలను వ్యాప్తి చేస్తున్నారన్నారు. జర్నలిజం నైతిక విలువలను కాపాడుకునేందుకు ఇదివరకే జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందన్నారు.జర్నలిస్టులకు ప్రతి మూడు, నాలుగు మాసాలకు ఒకసారి వైద్య శిబిరాల ఏర్పాటుతోపాటు, క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
జర్నలిస్టులందరికీ హెల్మెట్లను అందజేయాలని ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేని కోరారు.
అంతకుముందు జిల్లా అధ్యక్షులు పి విజయకుమార్ మాట్లాడుతూ….
ఆరోగ్య శిబిరానికి మంచి స్పందన లభించిందని, దాదాపుగా 400 మంది పాత్రికేయులు తమ కుటుంబాలతో హాజరయ్యి వైద్య శిబిరంలో సేవలను వినియోగించుకున్నారని తెలిపారు.జిల్లాలో పాత్రికేయులకు ఇలాంటి కార్యక్రమం తొలిసారిగా నిర్వహించడం జరిగిందని, అందుకు కృషి చేసిన రాష్ట్ర తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ ఆలికి, జిల్లా కార్యదర్శి మధు గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జర్నలిస్టుల ఓపి చికిత్సకు ప్రత్యేక పిఆర్ఓ ను ఏర్పాటు చేయాలని,జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపి ఉచితం తోపాటు మెడికల్ షాపుల్లో ఔషధాలు, టెస్టులకు 40 శాతం రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే ను కోరారు.
జిల్లా వైద్యాధికారి రవి నాయక్ మాట్లాడుతూ….
జర్నలిస్టులకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని,జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖ కృత నిక్షయంతో పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
శిబిరంలో మొత్తం 500 జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.శిబిరానికి సహకరించిన మలక్ పేట్ యశోద ఆస్పత్రి,జయ కృష్ణ హాస్పిటల్, గ్యాస్ట్రో అండ్ లివర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,శ్రీ నేత్రాలయ హాస్పిటల్ యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
యశోద ఆసుపత్రి వైద్య బృందం వైద్యురాలు డాక్టర్ శ్వేత మాట్లాడుతూ…
జర్నలిస్టులు తమ వృత్తి నిర్వహణతో పాటు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ప్రతినిత్యం బీపీ షుగర్ వంటి టెస్టులను ఎప్పుడూ చేయించుకుంటూ ఉండాలని ఆమె సూచించారు. నేటి శిబిరానికి వచ్చిన జర్నలిస్టులకు వైద్యురాళ్ళు అంతకుముందు నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జూపల్లి అరుణ్ టుడీ మరియు ఈసీజీ పరీక్ష శిబిరాలను ప్రారంభించారు.
యశోద ఆసుపత్రి మలక్పేట్ వారు అందించిన సేవలు:బిపి, షుగర్, ఈ సి జి, టుడి ఎకో, ఆల్ట్రా సౌండ్, బోన్ డెన్సి టీ, సేవలందించిన డాక్టర్లు: డాక్టర్ రఫీ, డాక్టర్ మనోజ్ఞ, డాక్టర్ అఖిల్, డాక్టర్ సాయి దుర్గ, డాక్టర్ శ్వేత, కార్డియాలజీ టెక్నీషియన్ ఉమా,బొన్దేన్సీ టెక్నీషియన్ ఐశ్వర్య, ఐ చెకప్ చంద్రశేఖర్, కోఆర్డినేటర్ శ్రీధర్ లు వైద్య సేవలు అందించారు.జయ కృష్ణ హాస్పిటల్ నాగర్ కర్నూల్ వారు డాక్టర్ దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులందరికీ మెడికల్ కిట్టును అందజేశారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూ జే ఐజేయూ జాతీయ నాయకులు సుదర్శన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు పి వెంకటస్వామి, కార్యదర్శి ప్రభాకర్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కన్నయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాం, జిల్లా కోశాధికారి పందిరి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు,నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షులు సందు యాదగిరి,నాయకులు కందికొండ మోహన్,కొండ కింది మాధవరెడ్డి,హకిం కిషోర్, వెంకటస్వామి, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు రాజేందర్ గౌడ్, అచ్చంపేట తాలూకా అధ్యక్షుడు సాయిబాబు, కల్వకుర్తి తాలూకా కార్యదర్శి శ్రీనివాస్,టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్,శ్రీశైలం,జయప్రసాద్, డాక్టర్ సలీం, డాక్టర్ దిలీప్ రెడ్డి, యశోద ఆసుపత్రి ఓ ఆర్డినేటర్ శ్రీధర్, రవీందర్ రెడ్డి,శ్రీను బాబు,స్ఫూర్తి ఓ కేసిన జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సైదులు తదితరులు పాల్గొన్నారు.