నేటి సత్యం చేవెళ్లే సెప్టెంబర్ 11
చేవెళ్ల జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాల ముందు నెలకొన్న సమస్యను శాశ్వత పరిష్కారం కు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. చేవెళ్లలో ప్రాథమికోన్నత పాఠశాలలో 1989-90 సంవత్సరంలో ఏడవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు pacs చైర్మన్ దేవర వెంకటరెడ్డి, బండారు చెన్నారెడ్డి, సినిమా థియేటర్ అమర్, గడ్డం నందు, భాను ప్రకాష్, కనకమామిడి తిరుపతిరెడ్డి, బండారు వెంకటరెడ్డి, మల్ గారి లక్ష్మారెడ్డి లు పాఠశాల ముందు వర్షం నీళ్లు నిలవకుండా శాశ్వత పరిష్కారం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ దసరా సెలవుల్లో ఈ సమస్య ను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆ పాఠశాల వద్ద మరుగుదొడ్ల పనులు ప్రారంభమయ్యాయి. నీళ్లు నిలవకుండా పూర్తిస్థాయిలో డ్రైనేజ్ లోకి వెళ్లే విధంగా చేయనున్నారు.