Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedమోడీ మణిపూర్ అసోమ్ పర్యటనలో నిజాయితీ లేదు డాక్టర్ కే నారాయణ !!

మోడీ మణిపూర్ అసోమ్ పర్యటనలో నిజాయితీ లేదు డాక్టర్ కే నారాయణ !!

నేటి సత్యం సెప్టెంబర్ 15

*వక్ఫ్ పై సుప్రీం తీర్పు హర్షణీయం*

*మోదీ మణిపూర్, అసోమ్ పర్యటనల్లో నిజాయతి లేదు*

*తెలంగాణ గవర్నర్ వ్యాఖ్యలు అర్థరహితం*

*మీడియాతో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ*

. నేటి సత్యం న్యూఢిల్లీ : వక్ఫ్​ (సవరణ) చట్టంలోని అనేక కీలక నిబంధనలను నిలిపివేస్తూ (హోల్డ్​ చేస్తూ) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్వాగటించారు.

న్యూఢిల్లీలోని ఎ. పి భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం మంద బలంతో చేసిన చట్టంపై సుప్రీం కోర్టు స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. సిపిఐ ముందు నుంచి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరినీ ఖండిస్తూనే ఉందని గుర్తు చేశారు. బిల్లు చట్ట రూపం పొందక మునుపే జాయిన్ట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరినట్టు గుర్తు చేశారు.

అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రకారం ఒక శాతం ఉన్న ప్రజలకు కూడా మతపరమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కేంద్రం ప్రభుత్వ ఏక పక్ష వైఖరికి చంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.

ఇక మోదీ చేపట్టిన అసోమ్, మణిపూర్ పర్యాటనలో నిజాయతి లేదని మండి పడ్డారు. మణిపూర్ మూడేళ్లుగా మండుతున్నా పట్టించుకోని మోదీ అటువైపు చూడలేదని పేర్కొన్నారు. అక్కడి సమాజం రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రమైన ఘర్షనలు జరిగినా పట్టించుకొని మోదీ ఇప్పుడు అక్కడకి వెళ్లి ఏమి సాదించలేదని పేర్కొన్నారు.

అయన పర్యటనపుంగనూరు జవాను పోయాడు వచ్చాడు అనే సామెత తరహాలో ఉందని ఎద్దేవా చేసారు. అప్పటికే నిర్మాణమై, ఉపయోగం లో ఉన్న పాత భవనాలను మళ్ళీ ప్రారంభించిన రావడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మోదీ మణిపూర్ పర్యటన మోస పూర్తితంగా ఉందని మండిపడ్డారు.

తెలంగాణ సాయుద పోరాటం వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ను విముక్తి చేసిన ఉద్యమంపై గవర్నర్ అలా మాట్లాడడం ఆర్ ఎస్ ఎస్ అజండాను మోయడమే అవుతుందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన పటేల్ పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు. నిజాం కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. 4 వేల మంది కమ్యూనిస్టుల త్యాగాలు, పది లక్షల ఎకరాల భూమి పంపకం తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవన్నీ మరచి గవర్నర్ ఆర్ఎస్ఎస్ సంస్థకు చెప్రాశిలాగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ, ఏపీ కేరళ, తమిళనాడు సహా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల గవర్నర్ లందరూ ఆర్ఎస్ఎస్ మూలాలకు చెందిన వారిని పేర్కొన్నారు. వారంతా కేంద్రానికి తోత్తులుగా మారి రాష్ట్రాల్లో సమాంతర పాలన చేస్తూన్నారని పేర్కొన్నారు. బీజేపీ ఆర్ ఎస్ ఎస్ నేతలకు తెలంగాణ సాయూదపోరాటం పై మాట్లాడే అర్హత లేదని వ్యాఖనించారు. ఇటు స్వతంత్ర పోరాటంలోనూ వారికి ఇసుమంత పాత్ర లేదని గుర్తు చేశారు. బిజెపిల నుండి ఒక్కరైనా జైలుకు వెళ్లారా ఒక లాటి దెబ్బ తిన్నారా ఒక తూటాని ఎదుర్కొన్నారు అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో తమవారు లేకపోవడం తో తమకు సంబంధం లేని వారి త్యాగాలను వాడుకుంటున్నరని, శవాలను కూడా అద్దెకు తీసుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని చురక లు అంటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments