నేటి సత్యం

*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే*
*దేశంలోని అనేక పోరాటాలకు ప్రేరణ*
నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 17
నిజాం నిరంకుశ పాలనను భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్ళతో పెకించించి వేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రేరణనే దేశంలో అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిందని పలువురు వక్తలు అన్నారు. ఆ పోరాట ఫలితంగానే ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం రగిలి మెరుగైన తెలంగాణ పౌర సమాజం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 77వ వారోత్సవాల ముగింపు బహిరంగ సభ బుధవారం హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభకు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎం.డి.యూసుఫ్,రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇటి.నరసింహా, కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, కళవేణ శంకర్, అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క హాజరయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపై ఆశీనులైయ్యారు.
ఈ సందర్భంగా కూనంనేని అధ్యక్షోపన్యాసం చేస్తూ దొరల పెత్తనం, భూస్వాముల అరాచకాలను వ్యతిరేకిస్తూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నాడు అన్ని స్రవంతులు ఏకమైన సాగించిన సమరమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు.ఈ పోరాట ద్వారానే నిరకుంశ నిజాం పాలన పతనమై హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందనిఎవరూ అవున్ననా, కాదానా చరిత్రే ఇందుకు సాక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోని గాని, దేశ స్వాతంత్రోద్యమంలో గాని ఏ చరిత్ర లేని బిజెపి ఇటు కమ్యూనిస్టులను అటు మాజీ ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూను తప్ప గాంధీ మొదలు గాడ్కేవరకు వివేకానంద నుంచి విప్లవ కెరిటం భగత్‌సింగ్ వరకు అంతా తమ వారే అంటూ సొంతం చేసుకునే కుట్రకు తెరలెపిందని విమర్శించారు. కమ్యూనిస్టులు అన్న ఎర్రజెండా అన్నా ఇప్పటికీప్రజల్లో గుండెల నిండుగా ప్రేమాభిమానాలు ఉన్నాయని వాటిని ముందుకు తీసుకువెళ్లడమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరులకు మనమిచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు.
సయ్యద్ అజీజ్‌పాషా మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానంలో నాడు 52 శాతం తెలుగు, ఆతర్వాత మరాఠ, కన్నడం వారు ఉంటే ముస్లింలు సంఖ్య కేవలం 10 శాతమేనన్నారు. దీంతో మెజార్టీ ప్రజలకు తమ మాతృభాషాలో చదువుకునేందుకు కూడ అవకాశం లేకపోయిందని, దీంతో బాషా పరిరక్షణ ఉద్యమంగా ప్రారంభమై ఆతర్వాత నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మారిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంమన్నారు. ఈ పోరాటంలో అన్ని వర్గా ప్రజలతో పాటు 10 శాతంగా ముస్లింల్లో 8 శాతం మంది ఇందులో ప్రత్యేక్షంగా పరోక్షంగా పాల్గొన్నారన్నారు. ఆలాంటి ఈ పోరాటం హిందూ ముస్లిం మధ్య జరిగిన ఘర్షణ ఏలా అవుతుందో బిజెపి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశానికి 1947లో స్వాతంత్య్రం లభిస్తే, నిజాం మాత్రం స్వాతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నం చేస్తే కమ్యూనిస్టు సారధ్యంలో ఏడాది పాటు పోరాడి నిజాం పీచం అణిచివేసిందన్నారు. దీంతో హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్టుల వశం కాబోతుందన భయంతో నాడు కేంద్రం ఆపరేషన్ పోలో చేపట్టగా ఇటు వైపు గాని అటువైపు గాని చుక్క రక్తం బొట్టు నేలరాకుండనే సెప్టెంబర్ 17న కేంద్రం ముందు నిజాం మొకర్లిలిన విధానమే చీకటి ఒప్పందంలో భాగమనేది స్పష్టమైందని పేర్కొన్నారు.
జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో పాటు రాజ్యాంగ బద్ద సంస్థలను చెరపట్టడంతో దేశం తీవ్ర సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాజ్యాంగంతో పాటు వ్యవస్థల పరిరక్షణకు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టులు మరో అవిశ్రాంత పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ సాయుధ పోరాటం ప్రభావం తెలంగాణ సమాజంపై ఎప్పుడూ ఉంటుందన్నారు. అయితే ప్రభావం ఎంత అనేది చెప్పడం మాత్రం కష్టతరమన్నారు. ఎందుకంటే ఈ ప్రేరణ విప్లవోద్యమంలో ఉన్న నాయకులు మొదల్కోని, మేదావులు, కవులు, కళాకారులు, పౌర సమాజం నిండి ఉందని పేర్కొన్నారు. అంత గొప్ప పోరాటంతో ఏ సంబంధం లేని బిజెపి చరిత్రను వక్రీకరించడం హాస్యస్పదమన్నారు.
కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సాధించుకున్న స్వేచ్చ మన తెలంగాణ అని, ఈ మన తెలంగాణ ప్రపంచంలో పేరెన్నికగల తెలంగాణగా అభివృద్ది సూచికగా నిలబడాలంటే శ్వాస సాయుధ పోరాటమేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రజాపాలన దినోత్సవ వేదికంగా ఉద్ఘాంటించారన్నారు. సిఎం ఈ మాటాలు ఎందుకు చెప్పారంటే తెలంగాణలో ఇప్పటికీ కమ్యూనిస్టుల ప్రాబల్యం, తాగ్యనిరితి ప్రజల్లో నెలకొని ఉందన్నారు. అయితే అంత చరిత్ర గల కమ్యూనిస్టుల ఉద్యమం చీలక వల్ల బలపడిందో బలహీనపడిందో అన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఎందుకంటే తాగ్యాలు , ఉద్యమాలు కమ్యూనిస్టులవైతే,, వాటి ఫలితాలను బుర్జువా పార్టీలు అనుభవిస్తున్నాయని, ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు తాత్కాలికంగ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించడం మంచి శుభపరిణామమని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనం దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం వారి వారి రాజకీయాలకు అనుగుణంగా ఎదో ఒక్క పేరుతో వేడుకలు నిర్వహించడం కొంత సంతోషమేనని అన్నారు.
విమలక్క మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో సమాజంలో అలజడులకు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం తగ్గకుండా కూడ ఓకారణమన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని కోరారు.