కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓట్ స్కాం?
మాలూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపు రద్దు
కర్ణాటక హైకోర్టు తీర్పు?
కర్ణాటక హైకోర్టు, కొలార్ జిల్లా మాలూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.వై. నంజెగౌడా గెలుపును చెల్లనిదిగా ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి మంజునాథ గౌడాపై కేవలం 248 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే కౌంటింగ్ వీడియో రికార్డులు లేకపోవడం కారణంగా కోర్టు ఎన్నిక ఫలితాన్ని రద్దు చేసి, నాలుగు వారాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు జరపాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలింది.