నేటి సత్యం!!


*మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీ వరద నీటి సమస్యకు తొందర్లో శాశ్వత పరిష్కారం..!!*
*వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు..!!*
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మన మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని *వీకర్ సెక్షన్ కాలనీ* లోని పలు ఇళ్లు నీట మునిగాయి. కాలనీ రోడ్లపై మోకాలి లోతు నీరు ప్రవహించడం వల్ల, ఇళ్లలోకి నీరు వచ్చి, ఇంట్లో సామాన్లు, వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతిన్నాయి.
*సాయి* అనే వీకర్ సెక్షన్ కాలనీ నివాసి ఇంట్లోకి వర్షం నీరు చేరి అంతా అతలాకుతలం చేసింది అని సోదరుడు *అఖిల్ యాదవ్* తెలపగానే, ఈరోజు ఉదయం ఆ కుటుంబాన్ని కలిసి ప్రస్తుత అవసరాల నిమ్మిత్తం వారికి *ఆర్ధిక సహాయం* అందించడం జరిగింది. అలాగే ఇంకో కుటుంబానికి రైస్ బాగ్ పంపించడం జరిగింది.
వెంటనే మన ప్రియతమ ఎమ్మెల్యే, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ *దేవిరెడ్డి సుధీర్ రెడ్డి* గారికి ఫోన్ చేసి, సమస్య తీవ్రతను, జరిగిన నష్టాన్ని వారికి వివరించి, కాలనీ వాసులతో మాట్లాడించి వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. శాంక్షన్ అయిన *స్టార్మ్ వాటర్ డ్రైన్* పనులను యుద్ధప్రాధిపదికన వెంటనే ప్రారంభించేలా అధికారులను ఆదేశిస్తాని ఎమ్మెల్యే గారు వారికి తెలియజేయడం జరిగింది.
వర్షం పడ్డ ప్రతీసారి వారికి ఇవే కష్టాలు. మన డివిజన్ సమస్యలను *పరిశీలించే కార్పొరేటరే* గానీ *పరిష్కరించే కార్పొరేటర్* కరువయ్యారు. సమస్యలను పరిష్కరిస్తారని ఎన్నుకుంటే పరిశీలనలతోనే పబ్బం గడుపుతున్నారు.
ఎమ్మెల్యే గారి సహకారంతో వీకర్ సెక్షన్ కాలనీ వాసుల కష్టానికి అండగా ఉంటాం అని, వారి సమస్యను పరిష్కరించడానికి వీలైనంత కృషి చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది.