మనసున్న కథలు తెలకపల్లి రవి పత్రికా రచయిత, సంపాదకుడు, కవి, విమర్శకుడు, ఉపన్యాసకుడు, చలనచిత్ర ప్రియుడు, సంగీతాభిమాని. అన్నిటినీ మించి క్రియాశీలక ఉద్యమశీలి. పైకి కన్పించని గాఢమైన భావుకత్వం వుండే మనిషి. రవి కథాగీతాలకూ, కథాప్రాణాలకు, జనానికిమధ్య ఉండే లంకెకు సాక్ష్యం ఈ సంపుటిలోని కథలు.ఈ సంపుటిలోని అన్ని కథల్లో వాస్తవ జీవుల ‘తడియారని కన్గవలు’ వున్నాయి. ‘పొడియారని గొంతులు’న్నాయి. బాధల పాటల పల్లవులున్నాయి. మంటలున్నాయి. మన సమాజంలోని వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలనూ, స్త్రీలనూ, వృద్ధులనూ, యువకులనూ, నడితరం వారిని చుట్టుముట్టిన సమస్యలను అర్థం చేసుకున్న మనస్సు, ఆ సమస్యలకు మూలమైన ఘటనల్లో సన్నివేశాల్లో సంఘ జీవుల మనస్తత్వమూ ప్రవర్తనా అనివార్యంగా ఏర్పడే మానవసంబంధాలు, చలనమూ, ఘర్షణా మనల్ని విచలితుల్ని చేస్తాయి. ఇవి మనసున్న కథకుడి కథలు.Rs.150/- H.O: 9490099350, 9490099437 ఈ పుస్తకం నవతెలంగాణ అన్ని బ్రాంచీలలో లబిస్తుంది