నేటి సత్యం 
రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి పుల్లెల జగన్ డిమాండ్
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 8 (రమేష్ రిపోర్టర్):-
గన్నేరువరం మండలం లోని సాంబయ్యపల్లి గ్రామంలో బుధవారం రోజున తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన్ మోహన్ ఆధ్వర్యంలో స్థానిక రైతుల తో కలిసి అధిక వర్షాల వల్ల నష్ట పోయిన పంట పొలాలను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అధిక వర్షాల వల్ల వరి పత్తి మొక్కజొన్న కూరగాయల పంటలు చాలావరకు దెబ్బతిన్నాయని రైతుల ఆరుగాలం కష్టం మరియు పెట్టుబడి నష్టపోయారని సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు జీల తిరుపతి యాదవ్ కు చెందిన రెండు ఎకరాల వరిపొలం నేలకొరిగి నీటిలో మునిగిపోయి నష్టం జరిగిందని, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా మరియు మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని పుల్లెల జగన్ మోహన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొట్టే భూమయ్య, నాయకులు జీల కుమార్యాదవ్, గడ్డం కరుణాకర్ రెడ్డి,జీల తిరుపతి యాదవ్, గడ్డం మల్లారెడ్డి,జీల ఎల్లయ్య యాదవ్,రైతులు పాల్గొన్నారు.