Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogబహుజన యుద్ధ వీరుడు కాన్సిరాం!!

బహుజన యుద్ధ వీరుడు కాన్సిరాం!!

నేటి సత్యం.

బహుజన యుద్ధ వీరుడు

మాన్యవర్ కాన్షిరాం..

కొల్లా పూర్, అక్టోబర్ 9 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్).

బహుజన యుద్ధ వీరుడు మ్యానవర్ కాన్షీరాం అని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ) కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బొల్లి కురుమయ్య అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ కొల్లాపూర్ నియోజక వర్గం ఆధ్వర్యం లో బామ్ సేఫ్ , డి ఎస్ 4, పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ 19వ వర్ధంతి నీ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంజి అధ్యక్షతన గురువారం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఎస్పీ పార్టీ నాయకులు నిర్వహించుకున్నారు.

ఈ సందర్భం గా పలువురు బి.ఎస్.పి పార్టీ నాయకులు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన బీఎస్పీ కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షుడు బొల్లి కురుమయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, లను కుట్ర పూరితం గా అణచివేస్తున్న పార్టీలను త్రిప్పు కొట్టుటకు బహుజనులు అంత ఏకం కావాలన్నారు.

ఎస్సీ ఎస్టీ బీసీ లకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, పార్టీలు అద్దె కొంపలని, ఆ పార్టీలలో బందిఖానాలో ఉండే కీలుబొమ్మ పదవులు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు పాలించే అధికారం లు రావన్నారు.

తర తరాలు గా సామాజికం గా ఆర్థికం గా రాజకీయం గా బహుజనులను అణచివేస్తూ కుట్ర పూరితం గా ఆయా వర్గాల ప్రజలను నేటి పాలకులు మోసం చేస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టుటకు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ, అగ్రకుల పేదలు, ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలనీ ఆయన పిలుపు ను ఇచ్చారు.

మన్యవర్ కాన్షిరాం ఈ దేశం లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ అధికార దండాన్ని రుచి చూపించి, మన ఓట్లు మనమే వేసు కోవడం ద్వారా అది సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు అని అన్నారు.

గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పితికితే పాలు రావని, అగ్రకుల మనువాద కాంగ్రెస్, బిజెపి , బిఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేసి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అధికారం లోకి రాలేరనీ బొల్లి కురుమయ్య అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం ఉద్యమం లో కార్యకర్తలు అమ్ముడు పోకుండా, అలసి పోకుండా, ఆగి పోకుండా రాజ్యాధికారం కొరకు ఉద్యమించాలన్న కాన్సిరాం నినాదాన్ని బి ఎస్ పి నాయకులకు కార్యకర్తలకు ఆయన గుర్తు చేస్తూ కాన్షి రాం ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాజాధికారం సిద్ధించుకునేందుకు బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

బీఎస్పీ సీనియర్ నాయకులు సుధాకర్, నాగశేషు, మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులందరూ చేయి చేయి కలిపి ఐక్య మత్యం తో టైం, టాలెంట్, ట్రెజరీని ఉద్యమానికి అందించి, ప్రజల కష్టాలు తీర్చడానికి కంకణ బద్దులు కావాలన్నారు.

ప్రతి గ్రామం లో ప్రతి మండలం లో బి ఎస్ పి పార్టీ ఏనుగు గుర్తు సింబల్ పై ఎంపీటీసీ, జెడ్పిటిసి, గా పోటీ చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు బీఎస్పీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సమస్త సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం అని , మన ఓట్లు మనం వేసుకోవడం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందనీ , ఆధిపత్యకుల అధికారం లో ఉన్నన్ని రోజులు బహుజన కులాల పైన మానసిక, భౌతిక దాడులు జరుగుతూనే ఉంటాయని, బహుజన కులాల్లోని విద్యావంతులు పూలే, అంబేడ్కర్, సిద్ధాంతాలను గౌర వించడం తో పాటు పాటించగలిగితే మార్పు సాధ్యమై బహుజనులకు అధికారం వస్తుందని వార న్నారు.

ఈ కార్యక్రమం లో బి ఎస్ పి జిల్లా నాయకుడు దాసు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మండల నాయకులు రామకృష్ణ, పారిజాత, దానయ్య,ఆనంద్, గోవు కుర్మయ్య మేఘరాజు, శరత్, నరేష్ ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments