*ఫినాయిల్ తాగిన ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థి*
*షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో చికిత్స*
*బాధితుడు మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్*
*పూర్తి వివరాలు చెప్పడానికి నిరాకరించిన విద్యార్థి తండ్రి, గురుకుల పాఠశాల అధ్యాపకులు*
నేటి సత్యం. షాద్నగర్. అక్టోబర్ 9
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల పదవ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ ఫినాయిల్ తాగాడు. దీంతో అనారోగ్యానికి గురైన హర్షవర్ధన్ ను వెంటనే మెరుగైన చికిత్స కోసం షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. గురుకుల పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ఫినాయిల్ విద్యార్థి హర్షవర్ధన్ ఎందుకు తాగాడు అన్న విషయం ఇంకా తెలిసి రాలేదు. ప్రభుత్వాసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న విద్యార్థి తండ్రి రమేష్ ను మీడియా అడుగగా వివరాలు చెప్పడానికి నిరాకరించాడు. అదేవిధంగా అక్కడే ఉన్న గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు సైతం తమకు తెలవదు అన్నట్టు మీడియాతో మాట్లాడారు. ఏం జరిగిందని అడగగా తన తెలియదని సమాధానం చెప్పడంతో మరి ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. కేశంపేట గురుకుల పాఠశాలకు సంబంధించి పట్టణంలోని చటాన్ పల్లి వద్ద ఈవిద్య సంస్థను నిర్వహిస్తున్నారు. బాలుడు ఫినాయిల్ ఎందుకు తాగాల్సి వచ్చింది? ఎవరైనా బలవంతంగా తాపారా లేక అక్కడ ఉంటే పొరబడి తాగాడా అన్న విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగితే తప్ప ఈ విషయం తెలియదు. ఈ మధ్యకాలంలో ప్రజెంట్ పాఠశాలల నిర్వహణపై అనేక ఆరోపణలు వస్తున్న విషయం విధితమే. ఓ గిరిజన విద్యార్థిని ఇటీవల టార్గెట్ చేసి రెసిడెన్షియల్ పాఠశాల నుండి తరిమివేసిన సంఘటన మరువకముందే మరో సంఘటన వెలుగు చూస్తోంది..