రంగారెడ్డి జిల్లా ప్రభుత్వహాస్పిటల్ లో. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని. మౌనా ప్రదర్శన
నేటి సత్యం కొండాపూర్ అక్టోబర్ 10
వైద్య విధాన పరిషత్ ఉద్యోగులందరికీ విజ్ఞప్తి.
ఫిబ్రవరి….17/3
మార్చి….9/4
ఏప్రిల్…8/5
మే……3/6
జూన్…7/7
జూలై….18/8
ఆగస్టు….4/9
సెప్టెంబర్…?
ఇవి గత కొన్ని నెలలుగా మనం జీతాలు అందుకున్న తారీఖులు. ఏ నెల ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉద్యోగ కుటుంబాలు ఎన్ని సాధక బాధకాలు ఎదుర్కొంటున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ విషయమై నిన్న అధికారులతో చర్చించిన తరువాత కూడా స్పష్టమైన పరిష్కారం కానరానందున మన ఆవేదన కాస్త సున్నితంగానైనా అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించి , ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా మన ఇబ్బందులు తెలియచేయడం కోసం రేపు (10/10/2025) మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అన్ని హాస్పిటల్స్ లో కాసేపు మౌన ప్రదర్శనకు పిలుపు ఇవ్వడం జరిగింది.టెక్నికల్ కారణాల వల్ల recognised యూనియన్ గా ఉన్న మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా నోటీస్ ఇప్పించినప్పటికీ యూనియన్లకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అతి సాధారణమైన మన డిమాండ్ కు శాశ్వత పరిష్కారాన్ని సాధించాల్సి ఉందని తెలియ చేస్తున్నాము.
ఈ మేరకు మన డిమాండ్ కు సంబంధించిన ప్లకార్డులు పట్టుకుని ప్రతి హాస్పిటల్ ముందు మధ్యాహ్నం 1నుండి 2 గంటల మధ్య పది నిమిషాల పాటు మౌన ప్రదర్శన చెయ్యాలి. ఈ కార్యక్రమానికి సంబంధించి కమిషనర్ గారికి నోటీస్ అందించిన విషయాన్ని మీ మీ హాస్పిటల్ అధికారులకు ముందుగా తెలియచేయండి.
ఎవరికీ ఎటువంటి ఆటంకం కలగకుండా ,క్రమశిక్షణగా,ప్రశాంతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.