నేటి సత్యం హైదరాబాద్ 
బి సి రాష్ట్ర బంద్‌కు డి హెచ్ పి ఎస్ సంపూర్ణ మద్దతు.
రాజ్యాంగ సవరణతో తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి.
మారుపాక అనిల్ కుమార్.డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
రాజ్యాంగ సవరణతో తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి
హిమాయత్ నగర్ : బీసీలకు నిజమైన న్యాయం చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి అని డి హెచ్ పి ఎస్ డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర సమితి సమావేశం రాజ్ బౌద్ధూర్ గౌరు విజ్ఞాన కేంద్ర, హీమత్ నగర్ లో కలిగంటి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ బిల్లులను ఆమోదించి రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని వారు స్పష్టం చేశారు.హైకోర్టు రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించడానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించాలని అన్నారు.బిసి రిజర్వేషన్ల సాధనకు వివిధ బిసి సంఘాలతో ఏర్పడిన ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’ (బిసి జెఎసి) చేపట్టిన ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు డి హెచ్ పి ఎస్ రాష్ట్ర కౌన్సిల్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మారుపాక అనిల్ కుమార్ తెలిపారు.రాజ్యాంగ సవరణతో తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి.బీసీలకు నిజమైన న్యాయం చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి అని డి హెచ్ పి ఎస్ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో టి రామకృష్ణ, జై కుమారస్వామి, కే రత్నకుమారి, బోయిని అశోక్, పొన్నగంటి లావణ్య, బి రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.