*ఎల్లమ్మబండ హిందు స్మశానవాటిక సుందరికరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్*
నేటి సత్యం

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ హిందు స్మశానవాటిక లో సుమారు యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బర్నింగ్ ఫ్లాట్ ఫారం స్లాబు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ హిందు స్మశానవాటికలో నిర్మిస్తున్న బర్నింగ్ ఫ్లాట్ ఫామ్ నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియచేసారు. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్న టాయిలెట్ బ్లాక్, సిట్టింగ్ గ్యాలరీ, పూజగది మరియు వాచ్ మాన్ రూమ్ నిర్మాణ పనులను కూడా త్వరలో పూర్తిచేసి అంతిమయాత్రలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మశానవాటికకు కావలిసిన అన్ని మౌలిక వసతులు చేకూర్చుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, ఆంజనేయ ప్రసాద్ గౌడ్, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.