
*ఘనంగా డి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
నేటి సత్యం నాగర్ కర్నూల్. అక్టోబర్ 22
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణ చారి భవన్ వద్ద *దళిత హక్కుల పోరాట సమితి* (DHPS) 19 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దళిత హక్కుల పోరాట సమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము భరత్, బండి లక్ష్మీపతి గార్లు మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 2006 అక్టోబర్ 22న సామాజిక న్యాయం, దళితుల ఐక్యత, రాజ్యాంగ హక్కుల సాధన, కుల నిర్మూలన అనే లక్ష్యాలు పూర్తి చేయడానికి ఏర్పడింది. తరతరాలుగా ఈ సమాజ అభివృద్ధికి తమ శ్రమను ధారపోస్తున్న దళితులు నేటికీ అమానుషమైన అంటరానితనం ,కుల వివక్ష ,అణిచివేత, దోపిడి ,దాడులు, హత్యలు, హత్యాచారాలు ,సాంఘిక బహిష్కరణకు గురవుతున్నారు భూమి, నీరు, గాలి, వెలుగు, సమస్త ప్రజలకు సమాన హక్కుగా దక్కాల్సి ఉండగా దళితులు వీటికి ఆమడ దూరంలో ఉంటూ కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారు విద్య వైద్యం ఉపాధి అందని ద్రాక్షలా మారాయి. ప్రైవేటీకరణ విధానాల వల్ల ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్ సౌకర్యాలు హక్కులు హరించబడుతున్నాయి డీఎస్పీఎస్ ఏర్పడినాటికి రాష్ట్రంలో అనేక దళిత సంఘాలు ఉన్నాయి సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం రిజర్వేషన్లు ప్రమోషన్లు వర్గీకరణ అనుకూల వ్యతిరేక ఆందోళనలకు మాత్రమే అవి పరిమితమయ్యాయి ఎస్సీలలో ఉప కులాల వారిగా సంఘాలు ఏర్పడ్డాయి కానీ దళితులు సంఘటితం కావడం విశాల ఐక్యతను సాధించడం ఐక్యంగా పోరాడి హక్కుల సాధించుకోవడానికి చారిత్రక అవసరంగా డిహెచ్పిఎస్ ఏర్పడింది కుల వివక్ష రూపాలను గుర్తించడం సమస్యలను వెలికి తీయడం తో పాటు ఒకఅంతర్జాతీయ కుల నిర్మూలనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనేక పోరాటాలు చేసింది ఇదే క్రమంలో దళితులు, అభ్యుదయవాద శక్తులను ఐక్యం చేసి ఉద్యమాలను నిర్వహించింది. కేవలం దళితులే కాక కుల వివక్ష, అంటరానితనం ,ఆదిపత్యం ఏ రూపంలో ఉన్న వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నది కుల నిర్మూలన జరగాలని భావించే ప్రతి ఒక్కరిని డిహెచ్పిఎస్ ఆహ్వానిస్తుంది ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలుకు మతంతో నిమిత్తం లేకుండా దళితులందరికీ అమలు చేయాలని పోరాడుతుంది. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తు దళితుల ఐక్యతకు కృషి చేస్తూ దళితుల సామాజిక ,ఆర్థిక, రాజకీయ రంగంలో సమానత్వ సాధన కోసం డిహెచ్పిఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు,
ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు చిన్నపాగా శ్రీను, బాల పేరు,కొత్త రామస్వామి, మారడు శివశంకర్, గోపి, భూపేష్, లక్ష్మయ్య, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.