*గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వండి* 
*గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించండి*
*భూ పోరాటం వర్ధిల్లాలి*
*సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి*
నేటి సత్యం చేవెళ్లే అక్టోబర్ 22
ఈరోజు చేవెళ్లలోని భూపారాట కేంద్రంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని 75వ సర్వే నెంబర్ లో 44 నెలలుగా ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఇండ్ల పట్టాల కోసం భూ పోరాటం నిర్వహిస్తున్నారని భూపో రాట కేంద్రంలో మంచినీళ్లు కరెంటు మౌలిక సదుపాయాలు లేకున్నా మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మాత్రమే పేదవాళ్లు, పేద వారి ఓట్లు గుర్తుకు వస్తాయని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం నిరు పేదల కోసం ఆలోచన చేసి గో పోరాట కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని లేనిచో ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్ NFIW జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి బాబురావు ఎలీషా యాదగిరి పాపయ్య పెంటయ్య లలిత భాగ్యమ్మ వెంకటమ్మ యాదయ్య తదితరులు పాల్గొన్నారు