Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaమహబూబ్నగర్ జిల్లాలో మొంథ తుఫాన్ ప్రభావం

మహబూబ్నగర్ జిల్లాలో మొంథ తుఫాన్ ప్రభావం

నేటి సత్యం_*ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మెంథా తుఫాన్ ప్రభావం*_

తీవ్ర వర్షాలతో– రహదారులపై వాగుల ఉధృతి, రాకపోకలు నిలిచిపోయాయి! 🌊

📍 నాగర్ కర్నూల్ జిల్లా – అచ్చంపేట మండలం బోల్గేట్ పల్లి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవాగు.📍 లింగాల మండలం – అంబటిపల్లి – అసలికుంట గ్రామాల మధ్య వాగులో చిక్కుకున్న కారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.📍 చారగొండ మండలం – గోకారం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ, గోకారం – ఎర్రవల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.📍 వెల్దండ మండలం – బైరాపూర్ వాగు ఉధృతం… బైరాపూర్ – వెల్దండ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి.📍 తాడూరు మండలం – మేడిపూర్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.📍 లింగాల మండలం – అవుసలికుంట గ్రామం వద్ద వాగు ప్రవాహం కారణంగా కొట్టుకుపోయిన కారు.📍 కుమ్మరోనిపల్లి గ్రామంలో – వరద నీటిలో మునిగిన పల్లె దవాఖానా.📍 వంగూర్ మండలం – ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం.📍 నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి – విద్యానగర్ కాలనీలోకి నీరు చేరడంతో సహాయక చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు.📍 రంగారెడ్డి జిల్లా – మాడుగుల మండలం సుద్ధపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ, మాడుగుల – సుద్ధపల్లి రహదారి నిలిచిపోయింది.📍 వనపర్తి జిల్లా మదనపురం – రామన్‌పాడు జలాశయంలో ఒక గేట్ ఎత్తివేత… ఇన్‌ఫ్లో: 3000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో: 3000 క్యూసెక్కులు.📍 మదనపురం – సరళ సాగర్ జలాశయంలో ఒక వుడ్ సైఫన్, ఒక ప్రైమరీ సైఫన్ ఆటోమేటిక్‌గా ఓపెన్.

⚠️ జాగ్రత్త! రహదారులపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు రాకపోకలు నివారించాలని అధికారుల విజ్ఞప్తి….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments