భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
– కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
-భారీ వర్షాల కారణంగా మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 29 (రమేష్ రిపోర్టర్):-
మెంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని *కలెక్టర్ పమేలా సత్పతి* బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి వనరులలో నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళవద్దని సూచించారు. కల్వర్టులు దాటువద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని కలెక్టర్ కోరారు
జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తాసిల్దారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తాసిల్దార్లు, ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని లు గ్రామాలు జల మాయమయ్యే ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు.
వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని, కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరా లో అంతారం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్, రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
నీటిపారుదల శాఖ అధికారులు
చెరువులు కుంటలు లోని నీటిమట్టలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ క్లోరినేషన్ చేపట్టాలన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు, వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని కలెక్టర్. సూచించారు.