గునుకుల కొండాపూర్ గ్రామపంచాయితీ పంపు ఆపరేటర్ మృతి
–అనుమానస్పద మృతి.
–బైక్ అదుపు తప్పిందా?మAaqaరింకేమైనా జరిగిందా?
అనే కోణంలో విచారణ
నేటి సత్యంన్యూస్ : గన్నేరువరం, నవంబర్ 03 (రమేష్ రిపోర్టట్):-
గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన గ్రామ కార్మికుడు
అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనఆదివారం రాత్రి బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన చొక్కల్ల లక్ష్మయ్య (55) బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో బంధువుల గృహప్రవేశానికి వెళ్లి వచ్చే క్రమంలో రాత్రిపూట వడ్లూరు శివారులో ద్విచక్ర వాహనం పై నుండి పడి మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని ఏదైనా మరో వాహనం ఢీ కొట్టిందా, వాహనం అదుపుతప్పడం మూలంగానే కిందపడి మృతి చెందాడ అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అతనిపై పడి ఉన్నది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనం అదుపుతప్పడం వల్ల జరిగిందా ఎవరైనా ఏమన్నా చేశారా అని కుటుంబ సభ్యులు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.