నేటి సత్యం న్యూస్: గన్నేరువరం,నవంబర్ 03 (రమేష్ రిపోర్టర్):-
గన్నేరువరం మండలం గుణుకుల కొండాపూర్ గ్రామ వరద కాలువ కెనాల్ మట్టి అక్రమ మట్టి రవాణా చేసే వ్యాపారస్తులకు కాసులు కురిపించే కల్పవృక్షంగా మారింది. ఇరిగేషన్ , మైనింగ్,అధికారుల నిర్లక్ష్యం తో అక్రమ మట్టి వ్యాపారస్తులు రాత్రి పగలు తేడా లేకుండా ఏదేచ్ఛగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు లారీలను గునుకుల కొండాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు మట్టి మాఫియాతో చేతులు కలిపి అక్రమ మట్టి రవాణాకు సహకరిస్తున్నారని దీనికి నిదర్శనమే అర్ధరాత్రి మట్టి రవాణా చేస్తున్న లారీలను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు వారు తక్షణం స్పందించి అక్రమటి రవాణాను అరికట్టాలని, అక్రమ మట్టి వ్యాపారానికి సహకరిస్తున్న ఇరిగేషన్ అధికారులపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.