పురుగుల రేషన్ బియ్యం పేదలకు
CPI కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు
నేటి సత్యం కొల్లాపూర్ నవంబర్ 4 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మల చింతలపల్లి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేటటువంటి రేషన్ బియ్యం ను షాపు నెంబరు 20 లో పంపిణి చేస్తుండగా కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు వేలడం జరిగింది.
పంపిణీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యం లో పురుగులు ఉన్నాయి ఈ రేషన్ షాప్ లో బియ్యం చాలా రోజులు ఆ బియ్యం అలాగనే ఉన్నాయి. అవే బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు స్వచ్ఛమైన సన్న బియ్యాని పంపిణీ చేస్తున్నామని రాష్ట్రంలో ప్రలోభాలు పలుకుతున్నారు కానీ తీరా చూస్తే గ్రామాలలో పేదలకు పంపిణీ చేసేటటువంటి రేషన్ బియ్యం లో మొత్తం పురుగులు ఉన్నాయి పురుగుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు.
ఒకపక్క పేదలు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు గురై బాధపడుతూ ఉన్నారు మరియు ప్రభుత్వ హాస్టల్లో పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఈ పాలకులు పేదల పైన చిత్తశుద్ధి లేకుండా పేదల జీవితాలతో చెలగాటమాడే విధంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారని వారు మండి పడటం జరిగింది దీనిపై ఉన్నత అధికారులు తగు విచారణ జరిపి ఈ నిర్లక్ష్యానికి కారకులైనటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయవలసిందిగా వారు పేర్కొనడం జరిగింది