నేటి సత్యం నాగర్ కర్నూలు జిల్లా నవంబర్ 6*సివిల్ విషయంలో జోక్యం చేసుకున్న కోడేర్ ఎస్సైను తక్షణమే సస్పెండ్ చేయాలి, జిల్లా ఎస్పీ వెంటనే బాధితున్ని పరామర్శించాలి, దళితుని కిడ్నాప్ మరియు చిత్రహింసలపై జ్యూడిషల్ ఎంక్వయిరీ వేయాలి – బిఎస్పీ డిమాండ్.*
ఇ రోజు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుల చేతిలో పాశవిక దాడికి గురై చికిత్స పొందుతున్న కోడేర్ మండలం, పస్పుల గ్రామ నివాసి మిద్దె ఎజ్రాను పరామర్శించారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్, రాష్ట్ర మాజీ ఈసీ మెంబెర్ పృథ్వీరాజ్ లు మాట్లాడారు. మిద్దె ఎజ్రాపై రమేష్ నాయడు, రాజు, ఝాన్సీ మరియు మిగిలిన ముగ్గురు కలిసి కిడ్నాప్ చేసి, పాశవికంగా దాడి చేసి, చంపడానికి ప్రయత్నం చేస్తే, ఇ దాడికి పోలీసుల ప్రత్యక్ష – పరోక్ష సహకారం ఉండటాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే కోడేర్ ఎస్సైను సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు. మిద్దె ఎజ్రా పెంట్లవెల్లికి చెందిన వారికీ 4 లక్షల 12 వేలు బాకీ ఉన్నారు. మొత్తం 7 లక్షల 12 వేలు ఐతే 3 లక్షలు గతంలో ఇవ్వడం జరిగింది. సోమవారం రోజు అనగా 03-11-2025 రోజున కొంతమంది వ్యక్తులు అందాద మధ్యాహ్నం 12 గం.లకు పసుపుల గ్రామానికి వచ్చి బెల్ట్ షాప్ లలో కూర్చొని మద్యం సేవించారు. అందాద సాయంత్రం 4గం.ల సమయంలో మిద్దె ఎజ్రా ఇంటి మీదికి వచ్చి అక్కడ చేతికి దొరికిన కర్రలతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్ర దాడికి పాల్పడ్డారు. మిద్దె ఎజ్రా దాడి నుండి తప్పించుకోవడానికి ఇంట్లోకి వెళ్లి, గడియ పెట్టుకుని 100 డయల్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చే సమయానీకే దుండగులు ఇంటి డోర్ పగలగొట్టి, కిటికీలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లడం జరిగింది. ఇ సమయంలో ఎజ్రా కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. అందదా 5-6 గం.ల మధ్యలో పోలీసులు వచ్చి, పోలీస్ వాహనంలో కాకుండా – నిందితుల వాహనంలో కోడేర్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లడం జరిగింది. అక్కడ ఎస్సై జగదీశ్వర్ కూడా బాధితుడు మిద్దె ఎజ్రాను మరోసారి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఎస్సై కొట్టిన తర్వాత మీకు చేతనైతే వెళ్లి చంపండి నేను చూసుకుంటాను అనీ రమేష్ నాయుడు, రాజు, ఝాన్సీలతో చెప్పడం జరిగింది. రమేష్ నాయుడు, రాజు, ఝాన్సీలు అక్కడి నుండి వారి వాహనంలోనే పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ లో సార్ లేడు ఉదయం రండి అనీ డ్యూటీలో ఉన్న వాళ్ళు చెబితే, ఇ దుండగులు పెంట్లవెల్లిలోని వాళ్ళ బంధువుల దాబాకు మిద్దె ఎజ్రాను తీసుకుని వెళ్లి రాత్రి మొత్తం చిత్రహింసలకు గురి చేశారు. కరెంటు షాట్ పెట్టి, జేసీబీతో గుంత తవ్వి పాతిపెడతామనీ, రాంపూర్ దగ్గర ఉన్న బ్రిడ్జిలో చంపి పడేస్తామని తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. మరునాడు మంగళవారం 04-11-2025నాడు మిద్దె ఎజ్రా కుటుంబ సభ్యులు డివిజనల్ సూపరిండెంట్ పోలీస్(DSP) దగ్గరికి వెళ్తే, మంగళవారం మధ్యాహ్నం అందాద 1-2 గంటల ప్రాంతంలో తీసుకుని వచ్చి పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి వెళ్లారు. అనగా సుమారు 18 గంటలు కొంతమంది ప్రవేయిట్ వ్యక్తులు మిద్దె ఎజ్రాను బంధించి, కొట్టి, చంపే ప్రయత్నం చేసి, తీరిగ్గా పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ లో అప్పజేప్పి వెళ్లడం ఏంటని మండిపడ్డారు. చట్టాన్ని ప్రయివేట్ వ్యక్తులు వారి చేతుల్లోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించ్చారు. అప్పు తీసుకున్న పాపానికి ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఏంటని దుయ్యబట్టారు. దీనికి కోడేర్ ఎస్సై సహకరించడం ఏంటని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన కోడేర్ ఎస్సై, ప్రవేయిట్ వ్యక్తుల చేతిలో చట్టాన్ని పెట్టడం ఏంటని నిలదీశారు. నాగర్ కర్నూల్ జిల్లాల్లో అనేకమంది వడ్డీ వ్యాపారులు ప్రజల్ని మోసం చేశారు. నాగర్ కర్నూల్ ప్రజలు మోసం చేసిన వడ్డీ వ్యాపారుల ఇండ్లమీదికి వెళ్తే అప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకున్నారనీ ప్రశ్నించ్చారు. ఆర్థిక నేరాల్లో ఆధిపత్య కులాలకు ఒక రకమైన చట్టం, బహుజనులకు ఇంకో రకమైన చట్టమా అనీ నిలదీశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనీ అడిగారు. మొలచింతలపల్లి గ్రామంలో ఒక చెంచు మహిళను, లక్ష్మీపల్లి గ్రామంలో ఒక BRS నాయకుడి హత్య, నేడు కోడేర్ మండలంలో కిడ్నాప్ – హత్య ప్రయత్నాలు ఏంటనీ విమర్శించారు. ఐనా సివిల్ కేసులలో పోలీసుల జోక్యం ఎందుకని గర్హించారు. ఒకవేళ బాధితున్ని తప్పు ఉంటే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, రిమాండ్ చేస్తే ఏం అవుతుండే అనీ అడిగారు. పోలీసులు కేవలం అధికార పార్టీకే వత్తాసు పలకకుండా జిల్లా ఎస్పీ నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరారు. మిద్దె ఎజ్రాపై దాడికి పాల్పడిన నిందితులపై మర్డర్ కేసు, SC-ST అట్రాసిటీ కేసు చట్టప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటే అవన్నీ వేయాలనీ డిమాండ్ చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సరిగ్గా వ్యవహరించపోతే ఎస్సీ, ఎస్టీ కమీషన్, మానవ హక్కుల సంఘం, రాష్ట్ర డీజీపీ దగ్గరికి వెళ్తామని అన్నారు. అవసరం ఐతే కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మంత్రి క్యాంపు ఆఫీస్ ముట్టడి, త్వరితగతిన బాధితుడికి న్యాయం జరగపోతే ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. పసుపుల గ్రామ సంఘటనపై ప్రజాస్వామ్య వాదులు, పౌర హక్కుల సంఘాల నాయకులు స్పందించాలని కోరారు. ఇ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ హర్ష ముదిరాజ్, బిఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు రాంచందర్, బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.