Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఢిల్లీ తీవ్రవాదుల దాడి.. ఒక పిరికిపంద చర్య....!టి. రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు

ఢిల్లీ తీవ్రవాదుల దాడి.. ఒక పిరికిపంద చర్య….!టి. రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు

నేటి సత్యం నవంబర్ 11 ఢిల్లీ తీవ్రవాదుల దాడి ఒక పిరికిపంద చర్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు టి.రామకృష్ణ*

నిన్న దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన తీవ్రవాద ముష్కరుల ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అని భారతదేశం ఇలాంటి చర్యలకు భయపడేది లేదని సిపిఐ స్పష్టం చేసింది నేడు . ఈ సందర్భంగా తీవ్రవాదం నశించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాo చేశారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో తీవ్రవాదుల దాడులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మతం పేరుతో దేశం పేరుతో కొంతమంది మూర్ఖులు చేస్తున్న ఈ నెరవేదానికి సరైన సమాధానం భారతదేశ ప్రజల ఐక్యతతో జవాబు చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తీవ్రవాదుల దాడులు ఒక ఆనవాయితీగా మారింది మన దేశంలోని ఆయన విమర్శించారు ఢిల్లీ నగరంలో బాంబు పేలుడు మన దేశ రక్షణ వ్యవస్థకు ఒక పెద్ద సవాల్ అని అంత పెద్ద నగరంలో అంత పేలుడు పదార్థాలు అత్యంత రద్దీతో కూడిన ఎర్రకోట సమీప ప్రాంతాల్లోకి ఎలా వచ్చాయి అనేది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సమాధానం చెప్పాలన్నారు నిత్యం దేశ రక్షణ అంటూ కబుర్లు చెప్పే మోడీ అమిత్ షాలు సమాధానం చెప్పాలన్నారు సరిగ్గా కొన్ని నెలల క్రితం పెహల్గామ్ లో జరిగిన దాడిని దేశం ఇంకా మరువలేదని ఆ చేతు జ్ఞాపకాల మరువక ముందే దేశ రాజధాని నడిబొడ్డున ఇంత పెద్ద పేలుడు జరగడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని టి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు దేశ రక్షణ కోసం చేశాం దేశంలో తీవ్రవాద చర్యలు అరికట్టడానికి చేసామని గొప్పలు చెప్పే అమిత్ షా ఈ దాడికి నైతిక బాధ్యత వహించి తక్షణం కేంద్ర హోంమంత్రికి రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు పెద్ద ఎత్తున తీవ్రవాదులు దేశంలోకి చొరబడుతుంటే మన ఇంటలిజెన్స్ వ్యవస్థ రక్షణ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా దేశమంతా ఏకమై తీవ్రవాద మూకలకు వారి కర్తవ్యం భాషలో సమాధానం చెప్పేందుకు ఐక్యతతో ముందుకు నడవాలని ఆయన అన్నారు

RELATED ARTICLES

1 COMMENT

  1. తాశీల్దార్ అవినీతి అగ్నిగుండం: ఇనుగుర్తిలో భూమి రిజిస్ట్రేషన్లకు ‘లంచమే’ ఫీజు!

    రూ. 5 వేలు ఇస్తేనే ఫైల్ కదులుతుంది! కలెక్టర్‌కు యాక్టివ్ పౌరుడి ‘సాక్ష్యం’

    ఇనుగుర్తి (మహబూబాబాద్ జిల్లా):
    మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండలం తాశీల్దార్ కార్యాలయంపై వచ్చిన అవినీతి ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. సామాన్య ప్రజలు, రైతులు తమ భూమి రిజిస్ట్రేషన్లు మరియు ముఖ్యమైన ప్రభుత్వ పనుల కోసం తాశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటే, అక్కడ పనులు జరగాలంటే ‘లంచం’ తప్పనిసరి అనే కొత్త నిబంధన అమలవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక యాక్టివ్ పౌరుడు నక్ ష్ యాకూబ్ పాషా గారు ఏకంగా జిల్లా కలెక్టర్ మరియు మజిస్టేటకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, తాశీల్దార్ అవినీతి బాగోతాన్ని బయటపెట్టారు.
    అవినీతి రారాజు’: తాశీల్దార్‌పై కలెక్టర్‌కు డైరెక్ట్ ఫిర్యాదు
    ఇనుగుర్తి తాశీల్దార్ భూభాగాల వ్యవహారాలు, చెరువుల మధ్యమార్గపు పంపిణీ, మరియు భూభారతి ఇంటర్నెట్ సేవలు వంటి ముఖ్యమైన విభాగాల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారని యాకూబ్ పాషా తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా మద్యపాన దుకాణాల యజమానుల ద్వారా వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించడం ఈ ఫిర్యాదులో సంచలన అంశం. ఫైల్ కదలికకు ‘5 వేల’ స్పీడ్ మనీ: లంచం ఇవ్వకపోతే అంతే సంగతి!
    ఈ అవినీతి పర్వంలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే… భూమికి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ పత్రాలు ముందుకు కదలాలంటే ఫైల్‌కు అదనంగా సుమారు రూ. 5,000/- (ఐదు వేల రూపాయలు) లంచం ఇవ్వాల్సి వస్తోందని ఫిర్యాదుదారు వాపోయారు. ఈ అక్రమ వసూళ్లతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, లంచం ఇవ్వలేని వారికి పనులు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్న రైతులు
    ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తామని చెబుతుంటే, మరోవైపు ఇనుగుర్తి తాశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు మరియు ఇతర ముఖ్యమైన సేవల్లో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన భూభారతి ఇంటర్నెట్ ఆధారిత సేవల్లోనూ డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు రావడంతో, రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది మధ్యవర్తుల ద్వారా వసూళ్లు: డబ్బుల ట్రాన్స్ఫర్ ఎలా?
    తాశీల్దార్ నేరుగా కాకుండా, కొందరు మధ్యవర్తులను (ముఖ్యంగా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా, మద్యపాన దుకాణాల యజమానులను) ఉపయోగించుకుని ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల లంచం ఇచ్చేవారికి, తీసుకునేవారికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ‘డర్టీ గేమ్‌’ పై విచారణ జరిగితే అనేక నిజాలు బయటపడే అవకాశం ‘కలెక్టర్ కాపాడండి!’: శాఖాపరమైన చర్యలకు డిమాండ్
    “అవినీతికి పాల్పడుతున్న ఇనుగుర్తి తాశీల్దార్ పై తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా” నక్ ష్ యాకూబ్ పాషా జిల్లా కలెక్టర్ ని కోరారు. వేలాది మంది రైతులు మరియు ప్రజల తరఫున ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఈ అంశాన్ని ఎంత త్వరగా సుమోటోగా తీసుకుని, విచారణకు ఆదేశిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
    ఫిర్యాదుదారు
    నక్ ష్ యాకూబ్ పాషా
    Cell: 7673968344

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments