“నాటి” నిబంధనలకు “నేడు” తూట్లు….
పట్టించుకోని అధికారులు,పాలకులు..
కొల్లాపూర్,నేటి సత్యం,నవంబర్ 14.
ఒకప్పటి ప్రభుత్వాలలో ఉన్న నియమ నిబంధనల కు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన లో చౌక ధరల దుకాణా (రేషన్ షాపు) ల నిర్వాహకులు డీలర్ లు”తూట్లు” పొస్తున్నా ప్రభుత్వం కానీ,ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం పట్టించు కోవడం లేదు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వం పేదలకు ఉచితం గా సరఫరా చేస్తున్న సరకుల పంపిణీ చౌక ధరల దుకాణం లు డీలర్ ల నివాసాలలో, వారి స్వంత ఇంటి నిర్మాణాలలో ఉండకూడదు అని నియమ నిబంధనల ను విధించేది.
. అయితే నేడు తెలంగాణ రాష్ట్రం లో అందులో ముఖ్యం గా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గము లోనీ చౌక ధరల దుకాణం లను డీలర్ లు తమ స్వంత ఇంటి నిర్మాణాలలో కొనసాగిస్తూ నాటి నియమ నిబంధనల కు నేడు తూట్లు పొడుస్తున్నారు అని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గము లోని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.