నేటి సత్యం హైదరాబాద్ నవంబర్ 20
*మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి*
తెలంగాణ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి టి.ఆనంద్ ఆధ్వర్యంలో మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు *రంగారెడ్డి జిల్లా మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల నిర్దేశించి మాట్లాడడం జరిగింది*. మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలి *పర్మినెంట్* చేసే వరకు కార్మికులకు *కనీస వేతనం 26వేల రూపాయలు అమలు చేయాలన్నారు*. *శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) కార్మికులకు కనీస వేతనం 35 వేల రూపాయలు మరియు పెట్రోల్, కార్మికులకు ఉదయాన్నే హాజరు తీసుకోవడానికి ట్యాబ్ ఇవ్వాలని అన్నారు*.కొన్ని దశాబ్దాల తరబడి విధులను నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదు జిహెచ్ఎంసిలో కార్మికులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. సెంటర్ డివైడర్లకు పారిశుద్ధ్య పనులు చేస్తున్న సమయంలో కార్మికులకు రక్షణ సదుపాయాలు కల్పించడంలో జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక ఎస్ ఎఫ్ ఏ చూసే ప్రాంతంలోని చెత్త ఒకే దగ్గర పాయింట్ డంపింగ్ చేయాలని అధికారులు కార్మికులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. చాలా దూరం నుండి చెత్తను తీసుకురావడానికి కార్మికులు తీవ్ర పందులు పడుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న క్యాజువల్ లీవులు సంవత్సరానికి 15 లీవులు నేటి వరకు కూడా అమలు చెయ్యకపోవడం మరి దారుణం. కార్మికులు మరణిస్తే దాన సంస్కారాల ఖర్చులు 30000 ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. విధి నిర్వహణలో కార్మికుడు ప్రమాద శాస్త్రం మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కాకుండా జిహెచ్ఎంసి సంస్థ నుండి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. కార్మికులు 60 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అవుతున్న కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. జిహెచ్ఎంసిలో పనిచేస్తున్న సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలో పారిశుద్ధ్య మరియు అన్ని విభాగాల విధులు చేస్తున్నటువంటి కార్మికులు ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న కార్మికుల నిజ వేతనాలు పెంచడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో రాష్ట్రంలోని రోజు రోజుకి విపరీతంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పస్తులుండి సేవలందిస్తున్న కార్మికులను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని అన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం యూనియన్ మండల అధ్యక్షులు:ఏ.రాజు, ఈ.సాయిలు, ఆర్.నరసింహ,జి.రమేష్, డి.పెంటయ్య, అండాలు, అండాలు, లక్ష్మి, కమలమ్మ, మంగమ్మ, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.