నేటి సత్యం *అంబేద్కర్ భవన్ నూతన కమిటీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు పేర్కొన్నారు.*
*గోపినగర్ అంబేద్కర్ భవన్ లో నూతన కమిటీను ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్ లో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ శ్రీమతి రాగం సుజాత నాగేందర్ యాదవ్ గారు తన సొంత ఖర్చులతో నిర్మించిన అంబేద్కర్ భవనంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం నూతన కమిటీ బాడీ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో స్థానికవాసుల సమక్షంలో ఏకగ్రీవంగా నూతన అధ్యక్షులుగా గ్రేటర్ హైదరాబాద్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ అధ్యక్షులు బజార్గట్ రమేష్ గారిని జన చైతన్య అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా, మల్కయ్య, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, సలహాదారునిగా నర్సింహా మరియు రవీందర్ లను ఎన్నుకోవడం జరిగింది.*
*ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ… నూతన కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అని అన్నారు. గోపినగర్, బాపునగర్, నెహ్రూనగర్ కాలనీలలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ధ్యేయంగా అన్ని రకాలుగా కృషి చేసానని, ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్ లో కమిటి వారి డిమాండ్స్ మేరకు ప్రహరీ గోడ, బాత్రూమ్ మరియు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.*
*ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తమ ఎంపికకు సహకరించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు.*
*ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ముసలయ్య, రాజ్ కుమార్, ఆనంద్, పట్టేట్టి ప్రవీణ్, సాయినాథ్, రంగుల ప్రవీణ్, వెంకటేష్, ఎర్రోళ్ల నర్సింహా, దస్తగిరి, ప్రభాకర్, యేసు, పెంటయ్య, మహేష్, అశోక్, తుకారామ్, కార్తీక్, సందీప్, శివా నాయక్ , గండయ్య, రాములు, కమిటీ సభ్యులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.*