గన్నేరువరం గ్రామ సర్పంచి అభ్యర్థిగా భూరా వెంకటేశ్వర్లు నామినేషన్ వేసారు.
గన్నేరువరం, ( నేటి సత్యం) డిసెంబర్ 1 :
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఉపసర్పంచ్
పద్మశాలి కులానికి చెందిన భూరా వెంకటేశ్వర్లు ఈరోజు సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.మందిమర్భాలంతో అంగరంగ వైభవంగా పద్మశాలి కులస్తులు అలాగే గ్రామ ప్రజల అండదండలతో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నేరువరం గ్రామ ప్రజలకు అండగా ఉంటానని అలాగే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.