*కాంగ్రెస్ మయమైన తెలకపల్లి మండల కేంద్రం*
నేటి సత్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తెలకపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు.
భారీగా తరలివచ్చిన జనం, బాణాసంచా, డప్పు దరువులతో పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడం జరిగింది.
ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలకపల్లి మండల కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నానని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం, మండల కేంద్రానికి అనుసంధానంగా కొత్త బీటీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని..,తెలకపల్లి మార్కెట్ యార్డ్ కు స్వయం ప్రతిపత్తి కల్పించి నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించబోతున్నామని,జనాల అవసరాలకు అనుగుణంగా నూతన తహసీల్దార్ భవనం నిర్మించబోతున్నామని ఆయన జనాలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. రాబోయే కాలంలో నాగర్ కర్నూల్ పట్టణానికి సమాంతరంగా తెలకపల్లి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నామని ఆ బాధ్యతను తాను తీసుకున్నానని,
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని మరియు ప్రతి సంక్షేమ పథకం నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొమ్ము శేఖర్ గారిని మరియు వార్డు సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎమ్మేల్యే గారు ప్రజలను కోరడం జరిగింది.
ఎమ్మేల్యే గారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.