ఐవిఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ నూతన కార్యవర్గం
నేటి సత్యం. డిసెంబర్ 14
*శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోగల క్రిస్టల్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఐవీఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం నూతనంగా కార్యవర్గ బాధ్యతలు చేపట్టిన సభ్యులందరికి శాలువా కప్పి మోమెంటోస్ అందజేసి అభినందనలు తెలిపారు.*
*ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం శాఖ డెవలప్మెంట్ మాజీ ఛైర్మెన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గజ్జెల యోగానంద్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంప సత్యనారాయణ గుప్త ఐవీఎఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కైలాస శ్రీనివాస్, ఐవీఎఫ్ హైదరాబాద్ కో అధికారి రాచురి కృష్ణ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మల్లేష్ గుప్త, పబ్బా మల్లేష్ గుప్తా, రాచూరి కృష్ణ గుప్తా, పసుమర్తి శ్రీనివాస్ గుప్తా, కైలాష్ శ్రీనివాస్ గుప్తా, చిన్నం సత్యనారాయ గుప్త, కట్ట రవి కుమార్ గుప్తా, యాదగిరి గుప్తా, నటరాజ్ గుప్త, నవీన్ గుప్తా, దారం లక్ష్మయ్య గుప్తా, జయకృష్ణ గుప్తా, నాగరాజు గుప్తా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.*