*డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .*
నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 17
*భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, డివిజన్ పరిధిలోని అన్ని కాలనీ, బస్తీలలో మౌలిక వసతులు కల్పిస్తామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.*
*శేరిలింగంపల్లి డివిజన్ లోగల సురభి కాలనీలో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గారు, జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .*
*ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భూగర్భ డ్రైనేజి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, అలాగే మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో శేరిలింగంపల్లి డివిజన్ లో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.*
*అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తాన్నామని అన్నారు.*
*కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్యరహిత, ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే తమ ప్రథమ లక్ష్యం అని అన్నారు.*
*ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ ఆర్ కృష్ణ, డీజిఎం నరేందర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ రామ్ బాబు, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, సీనియర్ నాయకులు చాంద్ పాషా, సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఆర్ వెంకట్ రెడ్డి, సెక్రటరీ సి.వి.భాను, వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఏ జయకృష్ణ, జాయింట్ సెక్రెటరీ జితేందర్ రెడ్డి, సలహాదారులు s.a చంద్రశేఖర్, ఆర్ కోదండరావ్, యోగి, లింగ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మల్లేష్, సుబ్బు, సిద్దు, ఆర్ భాస్కర్, ఆర్ కమలాకర్, ఆర్ శ్రీనివాస్, కుమార్, యామిని, కుమార్, జమున రాయల్, అలీం, జిహెచ్ఎంసీ సిబ్బంది మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.*