మనస్సు ప్రశాంతమైతే,
ప్రపంచం కూడా శాంతమవుతుంది…
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్, నేటి సత్యం,డిసెంబర్21.
సమాజం లోని ప్రతి మనిషి తన మనసు ను ప్రశాంత పరుచు కుంటే ప్రపంచం కూడా శాంతి మతము అవుతుందని తన చుట్టుముట్టు ఉండే సమాజం కూడా తనకు అర్థం అవుతుందని తద్వారా మనిషి మానసిక ప్రశాంతత తో అభివృద్ధి లోకి రావడం జరుగుతుందని కొల్లాపూర్ లోని శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ సందర్భం గా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఆదివారము రోజు జరిగిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని
ప్రతి ఒక్కరు ధ్యానాన్ని జీవితం లో భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడిని జయించవచ్చు అని, తాను మానసికము గా ప్రశాంతత పొందినప్పుడే సమాజము లోని వ్యక్తులను సమాజం లోని పరిస్థితులను ప్రశాంతం గా అర్థము చేసుకొని శాంతి కామకుడిగా జీవించగలుగుతాడని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ప్రశాంతం గా” ధ్యానము చేయండి ప్రశాంతం గా జీవించండి” అంటూ శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మెన్ సుర గౌని శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.