Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaసుప్రీంకోర్టు తీర్పు...

సుప్రీంకోర్టు తీర్పు…

** రాష్ట్రాల హక్కులపై గవర్నర్ల దాడులు:
సుప్రీంకోర్టు తీర్పు

ఎ.కోటిరెడ్డి

గవర్నర్ల అధికారాలను అదువు చేయటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వమ్ముచేయటం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించే విధంగా లేదు. తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్ల శత్యవైఖరితో వ్యవహరిస్తూ, శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలుపకుండా నిలిపివేయ టంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమో దించిన బిల్లులను నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించటం, అభ్యంతరాలుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపటం లేదా రాష్ట్రపతికి పంపించటం మినహా నిరవధికంగా తన వద్ద అట్టి పెట్టుకొనే అధికారం కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. అప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులు ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని కూడా తీర్పులో పేర్కొంది.

సమాఖ్యవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దోహదం చేసే ఈ తీర్పును వమ్ము చేయటం కోసం సలహా కోరటం (అడ్వైజరీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకు ప్రశ్నలను సంధించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దానిపై విచారణ జరిపి, నవంబరు 20వ తేదీన తుది తీర్పు వెలువరించింది. బిల్లులను ఆమోదించటానికి గవర్నర్లకు కాలపరిమితిని విధించలేమని, కానీ గవర్నర్లు బిల్లులను తమ వద్ద నిరవధికంగా ఉ ంచుకోవటం కుదరదని పేర్కొంది. అపరి మితమైన జాప్యం జరిగితే, కోర్టులు పరిమిత మైన ఆదేశాలు ఇవ్వవచ్చునని పేర్కొంది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గవర్నర్లను అదుపు చేయటానికి, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య
బద్ధంగా పనిచేయటానికి, రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన అధికారాలను అమలు జరపటానికి ఈ తీర్పు దోహదం చేయదు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లు ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలలోని ప్రభుత్వాల పట్ల శత్భవైఖరితో వ్యవహరిస్తు న్నారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అధికారం చలాయిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని వమ్ము చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలకు ఆమోదం తెలుపకుండా నిరవధికంగా తమ వద్ద అట్టిపెట్టుకొని, పాలనకు విఘాతం కలిగిస్తున్నారు. పోటీ ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ, ఆయా రాష్ట్రాల అంతరంగిక వ్యవహారాలలో అనుచిత జోక్యం చేసుకొంటు న్నారు. సమాఖ్యవాదం, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఉ పయోగించుకోవాలి. కానీ గవర్నర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం హరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలకున్న హక్కులు, అధికారాలు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద కేంద్రీకృతం అవుతుండటంతో రాష్ట్రాలలో పాలన సక్రమంగా సాగటం లేదు. కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారం కేంద్రీకరణ కావటం దేశ సమైక్యతకు, అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది.

వివిధ జాతులు, భాషలు, సంస్కృతులతో కూడిన భారతదేశంలో ఆయా జాతుల ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, వారి ఆకాంక్షలు నెరవేర్చుకోవాలన్నా అధికార వికేంద్రీకరణ తప్పనిసరి. దేశంలో విభిన్న ప్రాంతాలు, రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాలలో కూడా వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నాయి. ఢిల్లీ, మహరాష్ట్ర లాంటివి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. నాగార్జున సాగర్, భాక్రానంగల్ లాంటి ప్రాజెక్టుల వలన కొన్ని ప్రాంతాలు వ్యవసాయరంగంలో అభివృద్ధిని సాధించాయి. మరికొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు అన్ని విధాలుగానూ వెనుకబడి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎక్స్ ప్రెస్ రహదారులు నిర్మిస్తుంటే, మరికొన్ని ప్రాంతాలలో సైకిల్పై వెళ్ళటానికి కూడా వీలైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు గిరిజన ప్రాంతం లో ప్రజలకు అత్యవసరంగా వైద్యం అవసం “మైనపుడు వారు ఎదుర్కొనే బాధలు వర్ణనాతీతం. డోలీ కట్టుకొని, వాగులు, వంకలు దాటి రోగులను తీసుకొచ్చే సరికి పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఇటువంటి ప్రాంతాలలో అభివృద్ధిని గురించి చెప్పటం వలన ఉపయోగం లేదు. ఆ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల తక్షణ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు అత్యవసరంగా తీసుకోవాలి. అప్పుడే అభివృద్ధి అన్నమాటకు అర్ధం ఉంటుంది.

విద్య పరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రాలలో కూడా ప్రాంతీయంగా ఈ వ్యత్యాసం ఉన్నది. మన సమాజంలో ఉన్న కులపరమైన విభజనలు, ఆయా కులాలు నిర్వహించిన వృత్తులు తదితరాల వలన అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కూడా కొన్ని కులాలకు చెందిన ప్రజలు వెనుకబడిన పరిస్థితులలోనే ఉన్నారు. విద్యా వంతులు, ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా ఈ వ్యత్యాసాలను మనం గమనించవచ్చు.

ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో అధికారా లన్నీ ఒకే చోట కేంద్రీకరించబడటం అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. వెనుకబడిన రాష్ట్రాలు, ప్రాంతాలు, తరగతుల ప్రజలను అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన అధికారాలు, ఆర్థిక వనరులు ఉండాలి. తమ రాష్ట్రంలోని ప్రాంతాలు, ప్రజలను సమగ్రంగా అభివృద్ధి చేయటానికి తగిన విధంగా ఆ
ప్రభుత్వాలు తమ అధికారాలను వినియో గించుకోవాలి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు రాష్ట్రాలకు ఉన్న పరిమిత హక్కులను కూడా హరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా పనిచేయటాన్ని నిరోధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో సమాఖ్య తత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడటానికి వీలుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఉండాల్సిందని అభ్యుదయవాదులు భావిస్తున్నారు.

* సామాజిక వ్యవస్థను కోర్టులు పరిరక్షిస్తాయా?

అయితే పాలకవర్గాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులకు పూనుకున్నపుడు న్యాయవ్యవస్థ దానిని ఎదిరించి నిలబడ గలదా? రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, జాతీయో ద్యమ ప్రభావంతో సమాజంలో నెలకొన్న అభ్యుదయ భావాలను వమ్ము చేయటానికి, దేశాన్ని తిరోగమన మార్గంలో ప్రయాణింప జేయటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పూనుకున్నప్పుడు దానిని నిరోధించటం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం న్యాయవ్యవస్థకు సాధ్యమౌతుందా? పెట్టు బడిదారీ వ్యవస్థను సరైన మార్గంలో నడపటం కోసం వ్యవస్థలో ఒక భాగంగా న్యాయ వ్యవస్థ ఏర్పాటైంది. స్వాతంత్య్రానంతరం బడా పెట్టుబడిదారీవర్గం బాగా అభివృద్ధి చెందింది. తన లాభాలు, స్వప్రయోజనాల సాధన కోసం సామ్రాజ్యవాదులు, ద్రవ్య పెట్టుబడులతో మమేకమై వ్యవహరిస్తున్నది. అనేక సందర్భాలలో దేశ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, సమాఖ్య విధానం, ప్రజాస్వామిక భావజాలం తదితరాలు వీరికి ఆటంకంగా పరిణమిస్తున్నాయి. బడా పెట్టుబడిదారీ వర్గ ఆధిపత్యంలోని పాలకవర్గ కూటమి తనకు ఆటంకంగా పరిణమిస్తున్న వాటి నన్నింటినీ
ధ్వంసం చేస్తున్నది. జాతీయోద్యమంలో వెల్లివిరిసిన సమానత్వం, సహోదరత్వం, ప్రజలలోనెలకొన్న ఐక్యతా భావాలు కాలం గడుస్తున్న కొద్దీ పాలకవర్గాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. సమాఖ్య విధానం, అధికార వికేంద్రీకరణ, ప్రజాస్వామిక హక్కులు, ప్రజల మధ్య సౌహర్ద్ర సంబంధాలు, రైతు, పెట్టుబడిదారులకు కంటకంగా మారాయి. కార్మికవర్గాల మధ్య పెరుగుతున్న ఐక్యత వీటిని అధిగమించటం కోసం బడా పెట్టుబడి దారుల నాయకత్వంలోని బూర్జువా-భూస్వామ్య వర్గాలు వ్యవస్థపై దాడికి పూనుకున్నాయి. తమ లక్ష్యాన్ని సాధించుకోవటానికి మన సమాజంలోని అత్యంత అభివృద్ధి నిరోధక భావజాలానికి ప్రతినిధి అయిన బిజెపిని అధికారానికి తీసుకొచ్చారు. గతంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికీ ఇవ్వనంత మద్దతును, ఆర్థిక వనరులను పాలకవర్గాలు ఈ ప్రభుత్వం చేతిలో పెట్టాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజ్యాంగాన్ని, స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొల్పిన ప్రజాస్వామిక వ్యవస్థలను, ఆధునిక ప్రజాస్వామ్య భావజాలాన్ని సమూలంగా నాశనం చేయటానికి పూనుకున్నది. సమాజాన్ని
తిరోగమన మార్గంలో పయనింపజేయటానికి, మనువాదాన్ని దేశానికి మార్గదర్శిగా చేయటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి సమాజంపై ఆధిపత్యం సాధించటానికి పూనుకున్నది. నయాన, భయానా ప్రధాన. స్రవంతి మీడియాను గుపెట్లో పెట్టుకున్నది. తన విధానాలను వ్యతిరేకించే వార్తలు, విశ్లేషణలు ప్రచారంలోకి రాకుండా ఉ ండటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకొంటున్నది.

కేంద్రంలోనూ, అత్యధిక రాష్ట్రాలలోనూ అధికారంలో ఉండి, సమాజంపై ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఛెలాయిస్తున్న ఆర్ఎస్ఎస్-బిజెపి కూటమిని, రాజ్యాంగంపై అది చేస్తున్న దాడులను న్యాయవ్యవస్థ మాత్రమే నిరోధించలేదు. కొన్ని సందర్భాలలో, కొన్ని అంశాలపై కోర్టులు సానుకూలమైన తీర్పులు ఇవ్వవచ్చు. అన్ని సందర్భాలలో అలాంటి తీర్పులు ఇవ్వాలని భావించటం అత్యాశే అవుతుంది. మరి రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఆర్ఎన్ఎన్- బిజెపి దాడులను ఎలా ఎదుర్కోవాలి?

రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ఆర్ఎస్ఎస్-బిజెపి భావజాలాన్ని తిప్పికొట్టకుండా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానాలపై పాలకవర్గాల దాడులను తిప్పికొట్టటం సాధ్యం కాదు. వామపక్షాలు, అభ్యుదం అభ్యుదయ శక్తులు ప్రత్యామ్నాయ విధానాలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థపై బరితెగించి దాడులు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నింటినీ సమీకరించాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, లౌకిక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే సామాజిక శక్తుల సమీకరణలో పైచేయి సాధించాలి. ఆ విధంగా కృషి చేయటం ద్వారానా ప్రతీఘాత శక్తులకు మద్దతిస్తూ. తిరోగమన విధానాలను బలపరుస్తున్న పాలకవర్గాల కుట్రలను తిప్పికొట్టి, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విధానాలను కాపాడుకోగలం.

సమాజంలో ప్రత్యామ్నాయ శక్తులు ఆ స్థాయికి ఎదిగినపుడే న్యాయవ్యవస్థ తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. గత చరిత్రను చూసినా ఇదే గోచరిస్తుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తిరోగమన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కోర్టులు కూడా ఎక్కువగా తిరోగమన తీర్పులే ఇచ్చాయి. ఎమర్జెన్సిలో అనేక అంశాలలో కోర్టులు
ఇటువంటి తీర్పులు ఇవ్వటాన్ని చూశాం. జాతీయోద్యమం, సోషలిస్టు భావజాల ప్రభావంతో ప్రజా ఉద్యమాలకు ప్రతిబింబంగా అనేక అభ్యుదయ తీర్పులను కూడా కోర్టులు వెలువరించాయి. అందువలన ప్రత్యామ్నాయ భావజాలాన్ని, ప్రత్యామ్నాయ సంస్కృతిని, ప్రజా ఉద్యమాలను పెంపొందించకుండా న్యాయ వ్యవస్థ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టగలదని ఆశించటం అత్యాశ అవుతుంది. ఆర్ఎన్ఎన్-బిజెపిలు ప్రచారం చేస్తున్న తిరోగమన భావజాలాన్ని తిప్పికొట్టటానికి అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించటం, సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం ప్రజలను సన్నద్ధం చేయటం ద్వారా మాత్రమే బిజెపి ప్రభుత్వ విధానాలకు అడ్డుకట్ట వేయటం, వ్యవస్థలను సక్రమంగా పని చేయించటం, ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకువెళ్ళటం సాధ్యమౌతుంది.

*పెట్టుబడుల పేరుతో భూ దందా

విశాఖపట్టణంలో జరిపిన సిఐఐ పెట్టుబడుల సదస్సులో రాష్ట్రంలో 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి 613 సంస్థలతో ఒప్పందాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తమ అంచనాలకు మించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి విదేశాలలోని పెట్టుబడిదారులు ఉరుకులు పరుగులతో వస్తున్నారని, ఇదంతా తమ గొప్పేనని ముఖ్యమంత్రి, మంత్రులు జబ్బలు చరుచుకొంటున్నారు. ఐటి శాఖ మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ప్రయత్నం చేయటం ద్వారా మరి కొన్ని సంస్థలు వస్తున్నాయని, ఈ పెట్టుబడుల వలన రాష్ట్రంలో 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఊదర గొడుతున్నారు. గత అనుభవాలు, పెట్టుబడుల తీరు తెన్నులను చూస్తే ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లుగా పెట్టుబడులు, ఉద్యోగాలు రావటం అసంభవమని స్పష్టమౌతున్నది. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేయటానికి, రైతుల నుండి లక్షలాది ఎకరాల భూములు కాజేసి, పెట్టుబడిదారులకు కట్టబెట్టటానికి, కార్మికుల హక్కులను హరించటానికి ప్రభుత్వం ఈ విధంగా ప్రచారం చేస్తున్నది.

రాష్ట్రంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకు వచ్చామని తమ గత పాలనా కాలాన్ని టిడిపి ఆకాశానికి ఎత్తుతున్నది. 2014-19 సంవత్సరాలలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రచారం చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి కూడా ఇదే తరహా ప్రచారం కొనసాగించింది. కానీ వాస్తవాలు ఈ ప్రచారానికి విరుద్ధంగా ఉన్నాయి. 2014-19 మధ్య టిడిపి పాలనలో రాష్ట్రంలోకి పెట్టుబడులు పెడతామని అంగీకరించిన మొత్తం 1.70 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 67,000 కోట్ల రూపాయలు మాత్రమే వాస్తవంగా వచ్చాయని 2019, జులైలో విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించింది. 2019-24 సంవత్సరాలలో వైసిపి పాలనాకాలంలో అంతకన్నా ఎక్కువగా 12.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి ఒప్పందాలు జరిగాయని, 1.26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. ఈ కాలంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం వెనుకబడినట్లు వివిధ సంస్థలు ఇచ్చిన
వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

* ప్రపంచంలో పెట్టుబడుల తీరుతెన్నులు

టిడిపి మొదటి సంవత్సరం పాలన(2024 మే నెల నుండి 2025 మే నెల) కాలంలో రాష్ట్రం 9.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి టిజి భరత్ ప్రకటించారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీని నాశనం చేయటానికి వస్తున్న
ఆర్సెలర్ మిట్టల్, నివ్ఫన్ స్టీల్ కంపెనీ తెస్తున్నదని చెబుతున్న 61,780 కోట్ల రూపాయలు, భారీగా లంచాలు తీసుకొని, ప్రజలపై పెద్దమొత్తంలో భారాలు మోపటానికి ఆమోదం తెలిపి అదాని కంపెనీలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, మన రాష్ట్రానికి దమ్మిడి ఉపయోగం లేకపోయినా వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఉచితంగా ఇచ్చి తీసుకొస్తున్న ఈ పెట్టుబడులు పెట్టేవాటిలో ఉన్నాయి. లూలూ గ్రూప్ తదితరాలు

రాష్ట్రంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. కానీ, ప్రపంచంలో వివిధ దేశాలలోకి వస్తున్న ఎఫ్ఐలు ప్రోత్సాహకరంగా లేవు. పెట్టుబడుల రాక క్రమంగా తగ్గిపోతున్నది. 2022 సంవత్సరం కన్నా 2023లో 10 శాతం పెట్టుబడులు తగ్గాయి. 2023వ సంవత్సరంలో ప్రపంచవ్యాపితంగా 1.3 లక్షల కోట్ల డాలర్లు-114లక్షల కోట్ల రూపాయలు-పెట్టుబడులు పెట్టారు. యూరప్ ఖండంలోకి వస్తున్న పెట్టుబడులు కొద్ది మేరకు పెరగగా, మనదేశంలోకి వస్తున్న పెట్టుబడులు తగ్గాయి. ట్రంప్ పెడుతున్న ఆంక్షలు, ప్రపంచంలో
నెలకొన్న అనిశ్చితి, మార్కెట్లు కుంచించుకు పోతుండటం, ఎగుమతులు పడిపోవటం వంటి కారణాలతో పెట్టుబడులు పెట్టటానికి వెనుకాడుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ మనదేశాన్ని లక్ష్యంగా చేసుకొని, టారిఫ్లు పెంచుతానని, పెనాల్టీలు విధిస్తానంటూ తీవ్రమైన బెదిరింపులకు పాల్పడటంతో పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లోకి 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు-మొత్తం ప్రపంచ పెట్టుబడుల్లో 10 శాతం కన్నా ఎక్కువ రావటం ఆచరణ సాధ్యమేనా?

* విశాఖ ఉక్కుఫ్యాక్టరీ పరిశ్రమ కాదా?

రాష్ట్ర ప్రభుత్వం, పాలకపార్టీ: ,పాలకపార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం చూస్తుంటే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటానికి అహర్నిశలూ పని చేస్తున్నారనే భ్రమలో పడిపోతాం. 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించామని చెబుతున్న ఈ పెద్దలు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన, రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న విశాఖ ఉక్కుఫ్యాక్టరిని కేంద్రం ప్రైవేటీకరణ చేయబూనుకుంటే, ఉత్పత్తిని దెబ్బతీస్తూ, సంస్థ ఉనికినే ప్రమాదంలో పడవేస్తుంటే ఎందుకు వ్యతిరేకించరు? కేంద్రం కుట్రలో ఎందుకు భాగస్వాములౌతున్నారు? రాష్ట్రంలో ఉన్న
పరిశ్రమలలో విశాఖ ఉక్కుఫ్యాక్టరి భాగం కాదా! పెట్టుబడుల కోసం జరిపిన సదస్సులో జరిగిన ఒప్పందాల విలువ 13.25 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్ర విభజన తర్వాత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో వచ్చిన మొత్తం పెట్టుబడులు విశాఖపట్టణం ఉక్కు ఫ్యాక్టరీ విలువలో నాలుగవ వంతు కూడా లేవు. అంటే వీరు పరిశ్రమలను తీసుకొస్తున్నామన్న ప్రచారం మాటున రాష్ట్రాన్ని పారిశ్రామిక రహితం చేయటానికి ఉ వ్విళ్ళూరుతున్నారు. బడా పెట్టుబడిదారులు విదిల్చే ఎంగిలి మెతుకుల కోసం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేసేవారు రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ చేస్తారంటే నమ్మేదెలా? పారిశ్రామికీకరణ, పెట్టుబడుల ఆకర్షణ ముసుగులో పథకం ప్రకారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయటానికి, నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టమౌతున్నది. విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి సమీపంలో ఇప్పుడు మిట్టల్ ఉక్కుఫ్యాక్టరీని పెట్టుటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. మిట్టల్ ఉక్కుకు పోటిగా విశాఖ ఉక్కుఫ్యాక్టరీని వీరు ఉండనిస్తారా? అందువలన విశాఖ ఉ క్కుఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం, తర్వాత మూసివేయటమే పాలకుల లక్ష్యంగా కనిపిస్తున్నది. అప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి
ప్రజలు ఇచ్చిన 20 వేల ఎకరాలకు పైగా భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అందుబాటులోకి వస్తాయి. ఫ్యాక్టరిని స్వాధీనం చేసుకొనే ప్రైవేటు సంస్థలు, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఈ భూములను పంచుకొని వేలకోట్ల సంపాదించుకుంటారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు భూముల సేకరణలో మళ్ళీ కొందరు నాయకులకు లాభాలు దక్కుతాయి. అబ్బ! ఏమి లాభసాటి బేరాలు! విశాఖ ఉ క్కుఫ్యాక్టరిని ప్రైవేటువరం చేసినా. మూసివేయించినా లాభాలు! మిట్టల్ ఉ క్కుఫ్యాక్టరికి భూమి, అనుమతులు, రాయితీలు, గనుల కేటాయింపు తదితరాలు చేయించినా లాభాలు! వారి లాభాల కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలలో ఉన్నదని, తాము ప్యాకేజి ఇప్పించినా ప్రయోజనం లేదని, కార్మికులు పనిచేయటం ప్రజలను నమ్మింపజేయటానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వీరి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మితే విశాఖ ఉక్కుఫ్యాక్టరీని ముక్కలు చేసి, పంచుకొని తింటారు. ప్రజలు చైతన్యవంతంగా ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి, ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పోరాడితే రాష్ట్ర పారిశ్రామి కాభివృద్ధిలో విశాఖ ఉక్కుఫ్యాక్టర్ మకుటంగా కొనసాగుతుంది.

చంద్రబాబుగారు రాష్ట్ర ప్రజలకు రంగుల ప్రపంచాన్ని చూయిస్తున్నారు. కాకి-నక్క కథను గుర్తు చేసుకొండి. కాకి కష్టపడి సంపాదించుకున్న మాంనం ముక్కను కాజేయాలని భావించిన నక్క కాకిని పొగిడి, మాంసం ముక్కను కాజేసుకుపోయింది. నక్క పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బయిన కాకి తన శ్రమతో నంపాదించుకున్న మాంసం ముక్కను పోగొట్టుకుంది. పరిశ్రమలు, పెట్టుబడులు ప్రవాహం లాగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయన్న చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు నమ్మితే కాకిలాగా మోసపోయి భూములు, ఆస్తులు పోగొట్టుకుంటారు. రైతులను భయపెట్టి, మోసపుచ్చి, అభివృద్ధి పేరుతో వందల కోట్ల రూపాయల విలువైన భూములను బలవంతంగా తీసుకొని శత కోటీశ్వరులకు ఎకరం 99 పైసల లీజుకు కట్టబెడుతున్న చంద్రబాబునాయుడు, టిడిపి- జనసేన- బిజెపి ప్రభుత్వాలు ఎవరి తరఫున పని చేస్తున్నాయో స్పష్టంగానే తెలుస్తున్నది. ఇవాళ ఎక్కడో భూములు, ఆస్తులు లాక్కుంటున్నారని మిగతా చోట్ల ఉన్నవారు పట్టించుకోకపోతే రేపు మీ గ్రామంలోనే మీ భూములు, మీ ఆస్తులే లాక్కోవచ్చు. తస్మాత్ జాగ్రత్త! *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments