నేటి సత్యం *జిహెచ్ఎంసి లో విలీనమైన అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులందరికీ జిహెచ్ఎంసి వేతనాలు అమలు చేయాలని వినతి పత్రం*
*తెలంగాణ మున్సిపల్ సంగం (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరిస్తూ నూతనంగా నార్సింగ్ సర్కిల్ ని ఏర్పాటు చేయడంతో ఈరోజు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎస్ మల్లేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఎం శంకరయ్య, గండిపేట్ మండలం ఏఐటిసియు సీనియర్ నాయకులు ఎం.బాబురావు, గండిపేట్ ఏఐటియుసి మండల కౌన్సిల్ సభ్యులు డి బాలరాజ్ , శ్రీనివాస్ నార్సింగ్ డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
డిప్యూటీ కమిషనర్ గారికి కార్మికుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరిస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన నార్సింగ్ సర్కిల్ పరిధిలోనీ 5 డివిజన్ లు, నార్సింగ్, కోకాపేట్, నిక్నాపూర్, గండిపేట్, మణికొండ, వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు నార్సింగ్ సర్కిల్ లో పనిచేస్తున్న అన్ని విభాగాలలో కార్మికులందరికీ మున్సిపల్ వేతనాలు కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఇస్తున్నటువంటి వేతనాలు అమలు చేయాలని మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి కమీషనర్ గారినీ కోరడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ గ్రేటర్ కమిషనర్ దృష్టికి మీరు ఇచ్చినటువంటి వినతిపత్రాన్ని పంపిస్తానని చెప్పడం జరిగింది.