చైతన్య హై స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
నేటి సత్యం దిల్సుఖ్‌నగర్‌లోని సత్యనారాయణపురం కాలనీలో ఉన్న చైతన్య హై స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్‌బీ నగర్ ఏసీపీ శ్రీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె. సైదులు, చైతన్యపురి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ గోవర్ధన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ శ్రీ కృష్ణయ్య మాట్లాడుతూ, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, విద్యార్థులతో ఇలాంటి ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడం మెచ్చుకోదగ్గ విషయమని తెలిపారు. రాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మైనర్ విద్యార్థులు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.జీఎన్‌ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీ గింజల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలను చైతన్యవంతులను చేసే ఈ తరహా కార్యక్రమాలకు పోలీస్ శాఖ నుండి ఇంత మంది అధికారులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, డీన్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని రోడ్డు భద్రతపై నినాదాలతో ప్రజల్లో అవగాహన పెంచారు.