మేడారం మహా జాతరకు ఆహ్వానం
జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు మంత్రులు, అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పలువురు ఉన్నతాధికారులకు ఆహ్వాన పత్రికలు అందజేసి రావాలని ఆహ్వానించాను.
అలాగే, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి మేడారం మహా జాతరకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశాను
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తోంది. కనీవినీరితీలో ఈసారి జాతరను నిర్వహించబోతోంది..
#medaram