హైదరాబాద్ నాగోల్ అపార్ట్మెంట్ లో అమానుష సంఘటనజరిగింది… మానవత్వం మంటగలుస్తుంది
నేటి సత్యం హైదరాబాద్ నాగోల్
ఎన్నో ఏళ్ళుగా కుమారుని వద్ద ఉంటూ ఆరోగ్యం బాగా లేక వృద్ధుడైన వేణుగోపాల్ పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి కన్నుమూశాడు. దీంతో మంగళవారం ఉదయం కూతురు, అల్లుడు, ఇతర బంధువులు అపార్ట్మెంట్వద్దకు చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే, అపార్ట్మెంట్లోని మిగతా ఫ్లాట్లలో ఉంటున్న వారు, ప్లాట్ ఓనర్కు అభ్యంతరం తెలిపారు. శవం అపార్ట్మెంట్లో ఉంటే అరిష్టం అని, తీసెయ్యాలని పట్టుబట్టారు. ‘ఇప్పుడు అర్ధంతరంగా శవాన్ని తీసుకుపొమ్మంటే ఎక్కడికి తీసుకుపోతాం’ అని వేడుకున్నా వినలేదు. ‘మేం కిరాయి ఇంట్లో ఉంటున్నామని ఇలా మాట్లాడుతున్నారు.. అదే సొంత ఫ్లాట్అయితే మీరంతా సహకరించేవారే కదా.. కిరాయి ఇంటికి.. సొంత ఫ్లాట్లో శవానికి తేడా ఏమిటి’ అని ప్రశ్నిస్తే సమాధానమివ్వలేదు. తమకు అదంతా తెలియదని, కావాలంటే శవాన్ని రోడ్డుపై పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు చాలాసేపు తల్లడిల్లారు. అందరూ కలిసి గంటల తరబడి వేడుకోగా చివరకు ఓ షరతుపై అంగీకరించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత అపార్ట్మెంట్ మొత్తం కలర్వేయించాలని కండిషన్ పెట్టి సెల్లార్లో ఓ మూలకు డెడ్బాడీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. దీంతో వృద్ధుడి డెడ్ బాడీని సెల్లార్ లో ఉంచిన బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించి, సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు.
అరిష్టమనిఏ శాస్త్రమూ చెప్పలేదు