*షాద్ నగర్ డిసిపిగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ శిరీషా*.
షాద్ నగర్, నేటి సత్యం, జనవరి, 9 షాద్నగర్గా షాద్నగ షాద్నగర్ జిల్లా, షాద్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) అధికారిగా నూతనంగా నియమించిన సిహెచ్ శిరీష శుక్రవారం అధికారికముగా బాధ్యతలు చేపట్టారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ పై అంతస్తులో డిసిపి కార్యాలయం ఏర్పాటు చేశారు. షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సయ్య, కేశంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి, షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, నందిగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, షాద్ నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు సుశీల, శ్రీకాంత్, రవీందర్ నాయక్, విజయ్ కుమార్ తదితరులు డిసీపీకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.