నేటి సత్యం యునాని గవర్నమెంట్ డాక్టర్ లేక రోగుల అవస్థలు………*
ఇంటి దగ్గరనే ఉండి జీతం తీసుకుంటున్న వైనం…*
కొల్లాపూర్ మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు గతంలో యునాని గవర్నమెంట్ డాక్టర్ (ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్) గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఉండి, ప్రజలకు సేవలు అందించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే! కానీ ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న రూమును ఖాళీ చేశారనీ అక్కడ ఉన్న పాత హాస్పిటల్ సిబ్బందిని అడిగితే డాక్టర్ లేక గత మూడు సంవత్సరాలు గడుస్తుంది. ఆయన హాస్పిటల్ ఎక్కడ పెట్టారో? మాకు తెలవదని, గతంలో ఉన్న డాక్టర్ కి సంబంధించిన వార్డు నర్సులు చెప్పారు. మొత్తానికి మూడు సంవత్సరాలుగా డాక్టరు లేక ఆయుర్వేద చికిత్స కోసం వచ్చిన రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని, డాక్టర్ గారు ఇంటి దగ్గర ఉండి జీతం తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని, భారత రాష్ట్ర సమితి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు డీకే మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇదే హాస్పిటల్ గత కొన్ని దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సు డిపోకు వెళ్లే దారిలో కోట బురుజు టర్నింగ్ పాయింట్ లో ఉండేదని, అక్కడి నుంచి మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో పెట్టిన కూడా లాభం లేకుండా పోయిందని, డికే మాదిగ ఆయుర్వేద రోగుల తరఫునుంచి, ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాబట్టి కొల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు వెంటనే స్పందించి యునాని డాక్టర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో ఉండే ఆయుర్వేదానికి సంబంధించిన, డాక్టర్ను వెంటనే నియమించి, రోగులను కాపాడవలసిందిగా భారత రాష్ట్ర సమితి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు డీకే మాదిగ మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు..