*ఊరి బయట గుడిసెల్లో నివసిస్తున్న…యాచకులకు దుప్పట్లు పంపిణీ*
నేటి సత్యం జనవరి 10 ముధోల్ ప్రతినిధి కధం మారుతీప్రస్తుతం నిర్మల్ జిల్లాలో చలి అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులతోపాటు చిన్న పిల్లలు, ఆస్మా వ్యాధిగ్రస్తులు కూడా పలు ఇబ్బందులకు గురికావడంతో పాటు వైద్యుల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి అన్నీ ఉన్న వ్యక్తులకు వారే అన్ని ఏర్పాటు చేసుకుంటారు. మరి ఏమీ లేని నిరాశ్రయులు అనగా గుడిసెల్లో, బస్ స్టేషన్, దేవాలయాల వద్ద, వివిధ కళ్యాణ మండపాల వద్ద ఆరుబయట చలికి వణుకుతూ, బ్రతుకు జీవుడా అంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి నిరాశ్రయులకు లోకేశ్వరం మండలలోని ధర్మోర గ్రామంలో గల ఊరి బయట గుడిసెలో నివసిస్తున్న యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకు యం ఆంజనేయులు,దాతల సహాయ సహకారములతో దుప్పట్లను పంపిణీ చేశారు.ఆయన మాట్లాడుతూ..మానవసేవే మాధవ సేవ అన్న సూక్తితో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, పేదలను ఆదుకొనుట, అనాధలకు, నిరాశ్రయులకు భోజనంతోపాటు ఇటువంటి దుప్పట్లు పంపిణీ చేయడం మాకెంతో సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని వారు తెలిపారు. అనంతరం అనాధలు నిరాశ్రయులు మా అమ్మ నాన్న ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దోర శ్రీనివాస్ గౌడ్,అఖిలేష్ పాల్గొన్నారు.