*పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్*
నేటి సత్యం. శేర్లింగంపల్లి జనవరి 12దివంగత మాజీ మంత్రి, కార్మిక నాయకుడు స్వర్గీయ శ్రీ పి.జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్లో ఉన్న పీజేఆర్ విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఖైరతాబాద్ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఆయన చేసిన సేవలు, అభివృద్ధి పనులు మరువలేనివని గుర్తు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత పీజేఆర్ దే అని అన్నారు. పీజేఆర్ గారి ఆశయాలు యువతకు ఆదర్శం అని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సమ్మారెడ్డి, పట్వారీ శశిధర్, జి.రవి, భాస్కర్ రెడ్డి, షౌకత్ అలీ మున్నా, గోపాల్, మల్లేష్, నాగయ్య, బాల స్వామి, అగ్ర వాసు, యాదగిరి, సుధాకర్, మహేష్, వెంకట్, రవీందర్, మల్లయ్య, సత్తయ్య, బొర్రా నాగేశ్వర్ రావు, బాబ్జి, నారాయణ, క్యాటరింగ్ వాసు, జోహార్ సింగ్, నాగేష్, మహేష్, మోహన్, పుట్టం దేవి, మహిళలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.