*పి జనార్దన్ రెడ్డి కార్మిక నాయకుడు పేద ప్రజలకు ఎంతోమందికి ఇల్లు నిచ్చిన గొప్ప కమ్యూనిస్టు*
నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 12 పి జనార్దన్ రెడ్డి.జయంతి సందర్భంగా ఇజ్జత్ నగర్ కాలనీలో పి జనార్దన్ రెడ్డి.విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. టి రామకృష్ణ. శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కె చందు యాదవ్.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ. హైదరాబాద్ మహానగరంలో ఎన్నో బస్తీలను నిర్మించిన. నాయకుడు.పేదలకు ఇండ్ల స్థలాలు పంచిన గొప్ప కమ్యూనిస్టు భావాజాలాలు కలిగిన నాయకుడు పి జనార్దన్ రెడ్డి
కార్మిక నాయకునిగా మంత్రిగా సీఎల్పీ నాయకునిగా. నాటి..కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప ప్రజా సంకల్ప ప్రజా ఆదరణ కలిగిన నాయకుడు.జనార్దన్ రెడ్డి వారి ఆశయాల కోసం నాటి యువత నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం విద్యార్థుల చదువుల కోసం బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప యుద్ధ నౌక అని సిపిఐ రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో . ఎం వెంకటేష్ బి నారాయణ. జెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు