Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరోడ్డు భద్రత పై అవగాహన

రోడ్డు భద్రత పై అవగాహన

వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలి….

(యస్.పి. మల్లికార్జున సాగర్)

కొల్లాపూర్, నేటి సత్యం,జనవరి 19.

రోడ్లపై వాహనాలు నడిపేవారు తమ జీవితాలను కాకుండా ఎదుటి వారి జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకొని రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలని చిన్నంబావి మండల పోలీస్ ఎస్ఐ నాగరాజు వాహనాలు నడిపే వారికి సూచించారు.

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భం గా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము చిన్నంబావి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యం లో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో చిన్నంబావి మండల పోలీస్ ఎస్సై నాగరాజు గ వారి సిబ్బంది తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భం గా వాహనాలు నడిపే వారికి రోడ్డు భద్రత గురించి వారి సేఫ్టీ గురించి రోడ్డు నియమ నిబంధన గురించి పోలీసులు వాహనదారులకు అవగాహనను కల్పించారు.

రోడ్డు భద్రతల గురించి వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ ఎస్ఐ నాగరాజు పోలీసులు తెలియజేశారు.

ఈ కార్య క్రమం లో కాంగ్రెస్ నాయకులు పెద్ద దగడ గ్రామ సర్పంచ్ ఉడుత భాస్కర్ యాదవ్ , చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, వెంకటేష్ యాదవ్ (గ్రామ కాంగ్రెస్ నాయకులు), ఉప సర్పంచ్ సుదర్శన్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments