Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogబాసరలో వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి

బాసరలో వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి

*బాసరలో జనవరి 23న జరగనున్న వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి*-

సమీక్ష సమావేశంలో అధికారుల ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్*

నేటి సత్యం: జనవరి 19

బాసరలో జనవరి 23న జరగనున్న వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.బాసర ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌తో కలిసి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, దేవాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భక్తులకు సౌకర్యాల కల్పన, భద్రతా ఏర్పాట్లు, రవాణా, తాగునీరు, అక్షరాభ్యాసం వంటి అంశాలపై దృష్టి సారించారు, వేడుకలు జనవరి 21 నుండి 23 వరకు జరగనున్నాయని ఆలయ ఈవో ప్రకటించారు, దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.అనంతరం కలెక్టర్,ఎమ్మెల్యే శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments