Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogజ్ఞానం అనేది శక్తి మరియు ఆనందం..డాక్టర్ అంబేద్కర్

జ్ఞానం అనేది శక్తి మరియు ఆనందం..డాక్టర్ అంబేద్కర్

నేటి సత్యం నా జీవితంలో వేలాది గ్రంథాలను అవిశ్రాంతంగా అధ్యయనం చేయడం వలనే నేనింతటి మేధా సంపన్నుడనయినాను. నేను చదివిన పుస్తకములోని తత్వాన్ని బయటకు తీస్తాను. అవసరం లేని భాగాన్ని వదిలివేస్తాను*.

*జ్ఞానం అనేది శక్తి మరియు ఆనంద సాధనం అన్న హైంజలైట్ మాటలు అక్షర సత్యం.. పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టగానే నాకు అనంతమైన సుఖానుభవం కలుగుతుంది. చదవడంలో నాకు కలిగే ఆనందం వర్ణింపనలవి కానిది*.నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే మనవాళ్లు (చాలామంది) చదవరు. అధ్యయనం లేకుండా జ్ఞానం, జ్ఞానం లేకుండా శక్తి కలుగవు. ఎవరితో అయినా తలపడే ముందు మనం జ్ఞానంతో, శక్తియుక్తులతో సమర్థవంతంగా ఉండాలి. మీరు చదువుకొనే అభిరుచిని పెంచుకోండి. నేను వెనిస్ నుండి బొంబాయి కి ప్రయాణిస్తూ ఆరు రోజుల్లో 8 వేల పేజీలు చదివాను. మరొకసారి 64 గంటల పాటు ఒక పుస్తకాన్ని అది పూర్తయ్యే వరకు చదివాను*.

*పుస్తకాలు దీపాల వంటివి. అవి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి*.

*నేను నా భార్యాబిడ్డలకంటే పుస్తకాలనే ఎక్కువగా ప్రేమిస్తాను*.

*విద్యా వికాసము పొందండి, విద్యా వికాసాలను అందించండి, అంతర్గతంగా ఆందోళన పడండి. మార్పు కోసం ఆందోళన చేయండి. సంఘటిత పడండి. సమైక్యంగా ముందుకు సాగండి*.

*ఒక దేవాలయం నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్లను సృష్టిస్తే, గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది*.

*స్వేచ్ఛ సమానత్వ మహగ్ని జ్వాల..భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు*

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments