Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogనాలుగు లేబర్ కోడ్ లు కార్మికు ల గొంతుపై కత్తి లాంటిది

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికు ల గొంతుపై కత్తి లాంటిది

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల గొంతు పై కత్తి లాంటిది

రద్దు చేసే వరకు పోరాడండి కార్మికులకు సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య పిలుపు

…. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల గొంతు పై కత్తి పెట్టడమే అని అలాంటి కఠినమైన కార్మికుల బ్రతుకులను ఆగం చేసే నాలుగు లేబర్ కోడులు రద్దయి వరకు కార్మికులు పోరాడాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమకుల జంగయ్య పిలుపునిచ్చారు

గురువారం నాడు శేర్లింగంపల్లి లోని సిపిఐ కార్యాలయంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మె గోడపత్రికలను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ సిపిఐ మండల కార్యదర్శి కె చందు యాదవ్ సహాయ కార్యదర్శి వెంకటేష్ జెట్టి శ్రీనివాసులతో కలిసి ఆయన విడుదల చేశారు

ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లు పెట్టుబడుదారులు దోపిడిదారులకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆయన మండిపడ్డారు

కార్మికులు కార్మిక సంఘాలు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను లేకుండా చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని దీనికి కార్మిక వర్గం పోరాటాలతోనే బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలలో సాఫ్ట్వేర్ పరిశ్రమలలో పనిచేస్తున్న పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆయన అన్నారు

సంగం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఉద్యోగులు కార్మికులు ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో పాల్గొని తిరిగి కార్మిక చట్టాలను పొందడానికి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు

పోస్టరు విడుదల కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ మండల కార్యదర్శి కె చందు యాదవ్ సహాయ కార్యదర్శిలు వెంకటేష్ జెట్టి శ్రీనివాస్ మండల కార్యవర్గ సభ్యులు నారాయణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments