Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogశ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత

శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత

*చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయద్వారాలు మూసివేత*

• *చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయద్వారాలు మూసివేత.*

• *రాత్రి గం. 7.30లకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, పూజాదికాలు*

• *రాత్రి గం. 9.00లకు శ్రీస్వామిఅమ్మవార్లకు మహామంగళహారతులు*

ఈ రోజు (03.03.2026) చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయద్వారాలు మూసివేయబడ్డాయి.

తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాదికార్యక్రమాలు నిర్వహించి రాత్రి గం.9.00లకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు జరిపించబడుతాయి. అవకాశం మేరకు మహామంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి గం.9.00ల నుండి రాత్రి గం. 10.00ల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించబడుతాయి.

కాగా ఈ రోజు ఉదయం గం. 3.00లకు ఆలయద్వారాలు తెరచి మంగవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరిపించబడ్డాయి. మహామంగళ హారతులు సమయం నుంచే అనగా గం. 4. 30ల నుంచి గం. 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించబడింది.

గ్రహణం కారణంగా ఆలయప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు మరియు సాక్షిగణపతి, హాఠకేశ్వరం – ఫాలధార పంచధార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి.

గ్రహణం కారణంగా ఈ రోజు అన్నప్రసాదవితరణ కూడా నిలుపుదల చేయబడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments