Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘన నివాళి

సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘన నివాళి

సురవరం సుధాకర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెబ్బేట్టి విజేయుడు*

భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు మాజీ ఎంపీ సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి 84 వ జయంతి ఉత్సవాలు సిపిఐ కల్వకొల్ శాఖ లో నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు,ఉప్పసర్పంచి చిన్నకూర్మయ్య కేక్ కట్ చెయ్యడం జరిగింది అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెబ్బేట్టి వియేయుడు మాట్లాడుతూ సమయంలో మనుషుల మధ్య ఉన్న అంతరాలు సమసి పోవాలని మనుషులంతా సమానంగా జీవించే అద్భుతమైన వ్యవస్థ సోషలిజం వైపు సమాజం నడవాలని జీవితమంతా పోరాడిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు జిల్లాలో ఆరోజు ఉన్న తీవ్ర కరువు ప్రభావంతో ప్రజలందరూ వలసల వాడటన పడినప్పుడు వలస జిల్లాగా ప్రకటించి ఈ జిల్లాని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఆయన చేసిన పోరాటం నిత్యం ప్రజలకు గుర్తుంటుంది జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ఈ జిల్లా కరువు కాటకాలకు వలసలకు ఆకలి చావులకు పెట్టింది పేరుగా ఉన్న జిల్లాను చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న రేగుమానుగడ్డ నుండి హైదరాబాదు వరకు పాదయాత్ర నిర్వహించారు సుధాకర్ రెడ్డి గారు అని ఆయన గుర్తు చేశారు జిల్లాలో సంభవిస్తున్న ఆకలి చావులను నివారించేందుకు నడుం బిగించిన సురవరం సుధాకర్ రెడ్డి గారు జిల్లాలోని అనేక మారుమూల ప్రాంతంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆకలి చావులను అరికట్టేందుకు సిపిఐ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాలను నిర్వహించి పేదలను బతికించిన చరిత్ర ఆయనది అన్నారు ఈ జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం గతంలో పనిచేసిన నాయకులు అందరూ సురవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలోనే నాయకులు వాడితో కలిసి పోరాటాల్లో ఉద్యమాలలో పనిచేసిన కాలం మా జీవితంలో అతి గొప్ప కాలమని తెలియజేశారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ని బలోపేతం చేసి పేదవాడి కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రజెండాను చేరే రకంగా తీర్చిదిద్దడమే ఆయనకిచ్చే నిజమైన నివాళులు అని అది కచ్చితంగా చేసి చూస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు కొల్లాపూర్ నియోజక వర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగినది పెబ్బేటి విజయుడు అన్నాడు ఈ కార్యక్రమంలో సిపిఐ కల్వకోలు శాఖ సంఘం కృష్ణ సిపిఐ మండల సహకార్యదర్శి ఎం లక్ష్మీనారాయణ 13వ వార్డు సిపిఐ అమ్మపెళ్లి శ్రీశైలం కల్వకోలు శాఖ సిపిఐ సహకార్యదర్శి ఆర్య శివ ఏఐటీయూసీ యూనియన్ సంఘానిమోని బాలస్వామి చెంది.శివ కొండ.సురేష్ మైబుస్ ఏఎన్ఎం.వెంకటమ్మ సంఘం.బిందు సంఘం. రవీందర్ కాంగ్రెస్ నాయకులు.మాజీ సర్పంచ్ సంగం వెంకటస్వామి భీచ్చిగౌడ్ ఎల్లయ్య చారగొండ రాముడు సైదులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments