Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogబి.యన్ రెడ్డి నగర్ లో 116 ఎకరాలలో పార్క్ అభివృద్ధి

బి.యన్ రెడ్డి నగర్ లో 116 ఎకరాలలో పార్క్ అభివృద్ధి

ఎల్బీనగర్ జూన్ 16 నేటి సత్యం

కేబీఆర్ పార్క్ కు ధీటుగా బి.ఎన్.రెడ్డి నగర్ లో 116 ఎకరాల్లో ఆహ్లాదకరమైన పార్కు అభివృద్ధి : మధుయాష్కి గౌడ్

ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డి గారి వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు

సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ గారితో కలిసి ఏర్పాట్ల పరిశీలన

బి.ఎన్.రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం, జూన్ 16 (నేటి సత్యం ప్రతినిధి సక్రు నాయక్) బి.ఎన్.రెడ్డి నగర్ ప్రాంత వాసులకు కేబీఆర్ పార్కు లాగా ఆహ్లాదకరమైన వాతావరణం లో అద్భుతమైన పార్కు ఏర్పాటు కాబోతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. ఈనెల 18న బి.యన్ రెడ్డి నగర్ ను ఆనుకొని ఉన్న ఫారెస్టులో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. ఏర్పాట్లను అధికారులతో కలిసి మధుయాష్కి గారు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్ గారు, డీఎఫ్ఓ రోహిత్ రెడ్డి, ఏసీపీ కాశీ రెడ్డి గారితో కలిసి సీఎం గారి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు 116 ఎకరాల్లో పార్కును అందులో అందుబాటులోకి రావడం అదృష్టమన్నారు. 30 ఏళ్లుగా ఉన్న స్థల వివాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుందని పేర్కొన్నారు. పార్కుగా అభివృద్ధి చేయడమే కాకుండా రూ. 20 కోట్ల తో బి.ఎన్.రెడ్డి నగర్ పరిసర ప్రాంత ప్రజలకు వరద, డ్రైనేజీ నీటి సమస్య పరిష్కారానికి బాక్స్ డ్రైన్, డ్రైనేజీ లైన్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదని, హైదరాబాద్ నిధులన్నీ కాలేశ్వరాన్ని తరలించిందని విమర్శించారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడి నిధులను నగర ప్రజలకే ఖర్చు పెడుతూ అభివృద్ధిని, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈనెల 18న సాయంత్రం 4 గంటలకు జరిగే సీఎం రేవంత్ రెడ్డి గారి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిసర ప్రాంతాల కాలనీ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో డిఎఫ్ఓ శ్రీనివాస్, ఎఫ్ డీ ఓ బాబ్జీరావ్ గారు, వెంకటయ్య గారు , ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస్ రెడ్డి గారు, యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ గారు, జిహెచ్ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మకుటం సదాశివుడు గారు, మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ గారు, నేలపాటి రామారావు గారు, నాయకులు పర్వతి గణేష్ రెడ్డి గారు, రఘుమారెడ్డి గారు, భీమిడి రామకృష్ణారెడ్డి గారు, శరత్ చంద్ర గారు, కళ్లెం సుజాతా రెడ్డి గారు, రజిని రావు గారు, రాజేశ్వరి గారు, వసంత గారు, భాను గారు, మెరుగు రమేష్ రెడ్డి గారు, వినయ్ పటేల్ గారు, చంద్రకాంత్ గౌడ్ గారు, దాము మహేందర్ యాదవ్ గారు, శ్రీనాథ్ గారు, బద్రీనాథ్ గారు, ఆల వెంకటరెడ్డి గారు, షేక్ షాకీర్ గారు,ప్రవీణ్ రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, చిరంజీవి గౌడ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రేణు గౌడ్ గారు, అంతటి శ్రీనివాస్ గౌడ్ గారు, మనీష్ గౌడ్ గారు, సుధాకర్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ గారు, నంద కిషోర్ గారు, భవాని గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, వినోద్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments