Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogబయటపడ్డ మరో బారి కుంభకోణం

బయటపడ్డ మరో బారి కుంభకోణం

నేటి సత్యం హైదరాబాద్ జూన్16

తెలంగాణలో బయటపడ్డ మరో భారీ భూకుంభకోణం

ఏపీ కంపెనీలకు తెలంగాణ భూములు ధారాదత్తం

కోట్ల విలువైన సత్తుపల్లి తెలంగాణ ఫుడ్ పార్క్ భూములు అతి తక్కువ ధరకే కట్టబెట్టిన వైనం

ఏపీకి చెందిన “దీపక్ నెక్స్ట్ జెన్” కంపెనీకి కేవలం ఎకరానికి రూ.21 లక్షల చొప్పున 72 ఎకరాలు కేటాయింపు

ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తనయుడు స్లీపింగ్ పార్టనర్‌గా ఉండడంతోనే కట్టబెట్టారని ఆరోపణలు

బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.50 లక్షలు, టీజీఐఐసీ ధర రూ.40.47 లక్షలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్‌కు చెందిన 72 ఎకరాల టీజీఐఐసీ భూములను కేవలం రూ.21 లక్షలకు ఎకరా భూమి చొప్పున రూ.15.12 కోట్లకు ఏపీకి చెందిన “దీపక్ నెక్స్ట్ జెన్” కంపెనీకి కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం

అయితే ఈ భూమి పక్కనే ఉన్న రైతు నుండి సదరు కంపెనీ ఒక్క ఎకరం భూమిని రూ.75 లక్షలకు కొనడం గమనార్హం

ఫుడ్ పార్క్ కోసం 2008లో 203 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించగా, గతంలో మొక్కజొన్న, మామిడి, కొబ్బరిపీచు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్

ఇటీవల రూ.650 కోట్లతో రొయ్యల ప్రాసెసింగ్, చేపలు రొయ్యల దాణా తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసిన ఏపీకి చెందిన “దీపక్ నెక్స్ట్ జెన్” కంపెనీ యజమాని అడుసుమిల్లి సుబ్రమణ్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి తనయుడు ఈ కంపెనీలో స్లీపింగ్ పార్టనర్‌గా ఉండడంతో, కేవలం ఎకరానికి రూ.21 లక్షలకే కేటాయించారని ఆరోపణలు

టీజీఐఐసీ నిర్ధారించిన ధర రూ.40.47 లక్షలు కాగా, పక్కనే ఉన్న రైతు నుండి రూ.75 లక్షలకు ఎకరం కొనుగోలు చేయగా, కేవలం రూ.21 లక్షలకే ఏపీ కంపెనీకి కట్టబెట్టడంతో తీవ్ర విమర్శలు చేస్తున్న స్థానికులు

మరోవైపు డీపీఆర్ ప్రకారం రెండేళ్లలో 3 వేల మందికి ఉపాధి కల్పిస్తే సదరు భూమి కంపెనీ పేరుతో సేల్ డీడ్ అవుతుందని ఒప్పందం చేసుకోవడం గమనార్హం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments