Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు

నేటి సత్యం/ శేర్లింగంపల్లి / ఆగస్టు 15

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి:

                       టి. రామకృష్ణ

సిపిఐ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఎం వెంకటేష్ మండల సహకార దర్శి వహించారు

ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా టి. రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు లక్షలాది మంది ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కే చందు యాదవ్ సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపకుండా ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, రైతులు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కె వెంకటస్వామి డి.హెచ్.పి .ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు కమ్యూనిస్టులు మరింత బలంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు కే సుధాకర్. డిఎస్పి ఎస్ మండల కార్యదర్శి ఎస్ కొండలయ్య. ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కే శివకుమార్. మహిళా సమైక్య కార్యదర్శి వరలక్ష్మి. ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు టి నితీష్. ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బి నారాయణ మండల సహాయ కార్యదర్శి జెట్టి శ్రీనివాస్. ఎస్ నరసమ్మ సీనియర్ నాయకురాలు ఏం అశోక్ తిరుపతి భాస్కర్ రఘు తదితరులు పాల్గొన్నారు

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments